ప్రమఖ సీనియర్ జర్నలిస్టు వినోద్ దువాపై దేశద్రోహం కేసును గురువారం కొట్టివేసింది సుప్రీంకోర్టు. దిల్లీ అల్లర్ల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై గతేడాది మేలో ఆయనపై దేశద్రోహం సహా పలు ఇతర కేసులు నమోదయ్యాయి. అయితే 1962 నాటి కేదార్‌నాథ్ కేసు తీర్పును పరిగణనలోకి తీసుకుంటే ఈ కేసు చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.
1962 తీర్పు పాత్రికేయులకు పూర్తి రక్షణ కల్పిస్తుందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ప్రభుత్వంపై విమర్శలు చేసే పౌరులపై దేశద్రోహ అభియోగాలు మోపరాదని, అది భావప్రకటనా స్వేచ్ఛకే విరుద్ధమని 1962లో సుప్రీం తీర్పుచెప్పింది.
అయితే 10ఏళ్ల అనుభవం గల పాత్రికేయులపై సంబంధిత కమిటీ ఆమోదం తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న దువా విజ్ఞప్తిని జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ వినీత్ శరణ్‌తో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. అది కార్యనిర్వాహక పరిధిలో జోక్యం చేసుకోవడమే అవుతుందని తెలిపింది.
కేసు పూర్వపరాలు..