తెలంగాణ

telangana

By

Published : Mar 18, 2021, 5:56 PM IST

ETV Bharat / bharat

'బాధితురాలితో రాఖీ' తీర్పుపై సుప్రీం అసహనం

అత్యాచార కేసులో బాధితురాలితో రాఖీ కట్టించుకుంటే బెయిల్​ ఇస్తామన్న మధ్యప్రదేశ్​ హైకోర్టు ఇండోర్​ బెంచ్​ తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది. అపోహలు సృష్టించే ఉత్తర్వులు ఇవ్వొద్దని సూచించింది.

Supreme court
'బాధితురాలితో రాఖీ' తీర్పుపై సుప్రీం అసహనం

లైంగిక వేధింపుల కేసులో నిందితుడు బాధితురాలితో రాఖీ కట్టించుకుంటే.. బెయిల్‌ ఇస్తామన్న మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఇండోర్‌ బెంచ్‌ తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి కేసుల్లో అపోహలు సృష్టించే ఉత్తర్వులు ఇవ్వొద్దంటూ ఆ తీర్పును కొట్టివేసింది.

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి గతేడాది పొరుగింట్లో ఉండే మహిళపై అత్యాచారానికి పాల్పడగా.. బాధితురాలి ఫిర్యాదు మేరకు అతడిని పోలీసులు అరెస్టు చేశారు. 2020 ఏప్రిల్‌లో నిందితుడు.. బెయిల్‌ కోసం దరఖాస్తు చేశాడు. ఈ పిటిషన్‌ను విచారించిన మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్‌ బెంచ్‌ అతడికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. బాధితుడు రక్షాబంధన్‌ నాడు.. తన భార్యతో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లాలని, ఆమె చేతితో రాఖీ కట్టించుకుని రూ.11వేలు ఇవ్వాలని షరతు పెట్టింది. ఆమె కుమారుడికి రూ. 5వేల ఇవ్వాలని ఆదేశించింది.

ఈ షరతుపై తీవ్ర దుమారం రేగింది. బెయిల్‌ తీర్పును సవాల్‌ చేస్తూ కొంతమంది మహిళా న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం, ఆ తీర్పును కొట్టివేసింది.

ఇదీ చూడండి:'కట్, కాపీ, పేస్ట్' విధానంపై సుప్రీం అసహనం

ABOUT THE AUTHOR

...view details