తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆ తీర్పు చదువుతుంటే తలనొప్పి వచ్చింది' - హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు తీర్పు

కోర్టు తీర్పు ఇలాగేనా రాసేది అంటూ హిమాచల్‌ ప్రదేశ్​ ఉన్నత న్యాయస్థానంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అది చదువుతుంటే తలనొప్పి వచ్చిందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హిమాచల్‌ హైకోర్టు తీర్పుపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు.

supreme court Pulls Up Himachal High Court Over ncomprehensible Judgment
'కోర్టు తీర్పులు సామాన్యులకు అర్థమయ్యేలా ఉండాలి'

By

Published : Mar 14, 2021, 1:27 PM IST

కోర్టు తీర్పులు సరళంగా, సామాన్యులకు అర్థమయ్యేలా ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది. హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన ఓ వ్యాజ్యంపై శనివారం విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన ధర్మాసనం.. తీర్పు పాఠాన్ని రాసిన విధానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఈ వ్యాజ్యానికి సంబంధించి హిమాచల్‌ హైకోర్టు రాసిన తీర్పు పాఠం.. తలనొప్పి తెప్పించిందని న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఆర్‌.షా వ్యాఖ్యానించారు 'తీర్పు ఏమిటో ఇప్పటికీ అర్థం కాలేదు. పెద్ద పెద్ద వాక్యాలైతే ఉన్నాయి. ముందు ఒకటుంది. చివరికొచ్చేసరికి ఇంకోలా ఉంది. తీర్పు చదువుతున్నప్పుడు నా పరిజ్ఞానంపై నాకే అపనమ్మకం ఏర్పడింది. చివరి పేరా చదివిన తర్వాత తలనొప్పికి టైగర్‌ బామ్‌ రాసుకోవాల్సి వచ్చింది' అని ఎం.ఆర్‌.షా అన్నారు.

తీర్పులో తనకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదని న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ తెలిపారు. 'తీర్పు.. ఇలానా రాసేది. ఉదయం 10.10 గంటలకు చదవడం ప్రారంభించా. 10.55కి ముగించేసరికి నా పరిస్థితిని మీరు ఊహించలేరు. ఒక్క ముక్కా అర్థం కాలేదు' అని అన్నారు. ఈ సందర్భంగా జస్టిస్‌ కృష్ణయ్యర్‌ తీర్పులను చంద్రచూడ్‌ ప్రస్తావించారు. అయ్యర్‌ తీర్పులు సరళంగా, చదివేవారికి ఎలాంటి ఇబ్బందులు కలిగించేవి కావని అన్నారు.

ఇదీ చదవండి:'మహిళా న్యాయమూర్తుల కొరత ఆందోళనకరం'

ABOUT THE AUTHOR

...view details