Supreme Court on Visakha Ramanaidu Studio Lands Issue :విశాఖ రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. లేఔట్ వేసి స్టూడియో భూములు విక్రయించడంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. 2003 ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న అవసరాలకే భూమి ఉపయోగించాలని ఆదేశించింది. అందుకు భిన్నంగా భూములు వినియోగించవద్దని నిర్దేశించింది. సినీ అవసరాల కోసం 2003లో రామానాయుడు స్టూడియోకు ప్రభుత్వం 35 ఎకరాలు కేటాయించింది. అయితే అప్పటి లక్ష్యాలను తుంగలో తొక్కుతూ, కోస్టల్ నిబంధనలకు విరుద్ధంగా 20 ఎకరాల వినియోగానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతి ఇచింది.
Bandaru sathyanarayana : 'విశాఖ రామానాయుడు స్టూడియోను దోచుకునేందుకు కుట్ర'
దీనిపై ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు (MLA Velagapudi Ramakrishna Babu) హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కేసు కొట్టివేయడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఓఖా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం విచారణ జరిపింది.