Supreme Court On Manipur Violence : మణిపుర్‌లో బాధితుల పునరావాసాన్ని పర్యవేక్షించేందుకు నియమించిన మాజీ న్యాయమూర్తి జస్టిస్ గీతల్ మిత్తల్ నేతృత్వంలోని కమిటీ.. సుప్రీంకోర్టుకు సోమవారం మూడు నివేదికలను సమర్పించింది. అందులో హింస వల్ల నలిగిపోతున్న మణిపుర్ ప్రజలకు పరిహారం ఇచ్చే పథకాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపింది. అయితే ముగ్గురు సభ్యుల ప్యానెల్ పనితీరును సులభతరం చేసేందుకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
Supreme Court Manipur Hearing : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం.. ఈ మూడు నివేదిక కాపీలను సంబంధిత న్యాయవాదులందరికీ అందజేయాలని తెలిపింది. మణిపుర్ బాధితుల్లో ఒకరి తరఫు న్యాయవాది బృందా గ్రోవర్‌ను ప్యానెల్‌కు సంబంధించిన సూచనలను క్రోడీకరించాల్సిందిగా ఆదేశించింది. మణిపుర్ బాధితుల పరిహారం ఇచ్చే పథకాన్ని పునఃసమీక్షించడానికి ఓ అధికారిని నియమించాలని ఆదేశాలు జారీ చేసింది.
"సుప్రీంకోర్టు (మణిపుర్ హింసపై) ఏర్పాటు చేసిన కమిటీ.. మూడు నివేదికలను సమర్పించింది. ఈ నివేదికలన్నీ పిటిషనర్లకు అందుబాటులో ఉంటాయి. వాటిని మేం పరిశీలిస్తాము. కమిటీ ఎలా పని చేయాలో విధానపరమైన అంశాలను సూచిస్తాం"
- విశాల్ తివారీ, సుప్రీంకోర్టు న్యాయవాది
Committee On Manipur Violence : మణిపుర్ బాధితుల ఉపశమనం, పునరావాసం కోసం ముగ్గురు మాజీ మహిళా హైకోర్టు న్యాయమూర్తులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆగస్టు7వ తేదీన.. సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ కమిటీకి జస్టిస్ గీతా మిత్తల్ నేతృత్వం వహిస్తారని.. జస్టిస్ షాలినీ జోషి, జస్టిస్ ఆషా మేనన్ సభ్యులుగా ఉంటారని సుప్రీంకోర్టు తెలిపింది. హింస చెలరేగిన రాష్ట్రంలో న్యాయ పాలనపై విశ్వాసాన్ని పునరుద్ధరించడమే తమ ప్రయత్నమని తెలిపింది.
Manipur Parading Incident : మే 4న ఇద్దరు మహిళలను వివస్త్రలుగా చేసి ఊరేగించిన ఘటనపై ఆగస్టు 1న అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. మణిపుర్‌లో శాంతిభద్రతలు నెలకోల్పడంలో ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమయ్యాయని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. మణిపుర్ దారుణాలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంలోనూ అక్కడి పోలీసులు అలసత్వం ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు తీరు సైతం సరిగ్గా లేదని మండిపడింది. జాతుల మధ్య ఘర్షణలో పరిస్థితులను అదుపులోకి తెచ్చే విషయంలో పోలీసులు చేతులెత్తేశారని పేర్కొంది.
నిరసన ర్యాలీలో హింస..
Manipur Violence Reason : మే 3వ తేదీన చురచంద్పుర్ జిల్లా టోర్బంగ్ ప్రాంతంలో మణిపుర్ గిరిజన విద్యార్థుల యూనియన్(ఏటీఎస్యూఎం) 'గిరిజన సంఘీభావ యాత్ర' పేరుతో భారీ ర్యాలీ చేపట్టింది. ఇంఫాల్ లోయలో అధిక సంఖ్యలో ఉండే మైతీ సామాజిక వర్గం.. తమను ఎస్టీ జాబితాల్లో చేర్చాలని డిమాండ్ చేయడాన్ని నిరసిస్తూ.. ఏటీఎస్యూఎం ఆందోళనకు పిలుపినిచ్చింది. మేతీ కమ్యూనిటీ చేస్తున్న ఎస్టీ హోదా డిమాండ్‌పై నాలుగు వారాల్లోగా కేంద్రానికి సిఫారసు పంపాలని మణిపుర్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడానికి నిరసనగా ఈ మార్చ్ నిర్వహించారు. వేలాది మంది హాజరైన ఈ ర్యాలీలో.. గిరిజనులు, గిరిజనేతరుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. అలా అప్పటి నుంచి కొనసాగుతున్న అల్లర్లలో 160 మందికిపైగా మరణించారు. అనేక మంది గాయపడ్డారు.
Manipur Violence CBI : సీబీఐ చేతికి మరో 9 'మణిపుర్ అల్లర్ల' కేసులు.. మహిళా అధికారులను కూడా..
మణిపుర్‌లో మళ్లీ హింస.. గ్రామస్థులపై సాయుధుల కాల్పులు.. ముగ్గురు మృతి