తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సుప్రీం కోర్టులో ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు.. జీతం రూ.60 వేలకుపైనే - సుప్రీం కోర్టు రిక్రూట్​మెంట్​ 2022

Supreme court job vacancy 2022: మీరు ఏదైనా డిగ్రీ చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం సన్నద్ధమవుతున్నారా? అయితే, ఇది మీకు సువర్ణావకాశం. జూనియర్​ కోర్టు అసిస్టెంట్​ పోస్టులకు సుప్రీం కోర్టు నోటిఫికేషన్​ జారీ చేసింది. డిగ్రీ అర్హతతో నెలకు రూ.63 వేల వేతనంతో ఉద్యోగం పొందొచ్చు. పోస్టులు ఎన్ని ఉన్నాయి, దరఖాస్తు తేదీ వంటి వివరాలేంటో తెలుసుకోండి మరి.

Supreme Court of India
సుప్రీం కోర్టు

By

Published : Jun 19, 2022, 12:08 PM IST

Updated : Jun 19, 2022, 12:19 PM IST

Supreme court job vacancy 2022: దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఉద్యోగం పొందేందుకు నిరుద్యోగులకు ఇదో సదావకాశం. సాధారణ డిగ్రీతోనే ఉద్యోగం పొందొచ్చు. తాజాగా జూనియర్​ కోర్టు అసిస్టెంట్ (గ్రూప్​ బీ నాన్​ గెజిటెడ్​) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ జారీ చేసింది సుప్రీం కోర్టు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 210 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు బేసిక్​ పే కింద నెలకు రూ.35,400గా ఉండగా.. ఇతర అన్ని అలవెన్సులు కలిపి మొత్తంగా రూ.63,068 వరకు వస్తుంది.

  • విద్యార్హతలు:గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైన డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • కంప్యూటర్​పై నిమిషానికి 35 పదాలు(ఆంగ్లం) టైపింగ్​ చేయగలగాలి.
  • కంప్యూటర్​ ఆపరేషన్​పై అవగాహన ఉండాలి.

వయోపరిమితి:నోటిఫికేషన్​ ప్రకారం అభ్యర్థులు 2022 జులై 1 నాటికి 18 ఏళ్లు పైబడి 30 ఏళ్ల వయసులోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, ఎక్స్​సర్వీస్​మెన్​, స్వాతంత్య్ర సమరయోధులపై ఆదారపడే వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. సుప్రీం కోర్టు రిజిస్ట్రీలో పని చేస్తున్న అభ్యర్థులకు గరిష్ఠ వయో పరిమితి లేదు. అయితే, ఇతర ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న వారికి ఎలాంటి సడలింపులు లేవు. అలాగే.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి.

పరీక్షా విధానం:100 ప్రశ్నలతో ఆబ్జెక్టివ్​ తరహా రాత​ పరీక్ష ఉంటుంది. అందులో 50 జనరల్​ ఇంగ్లీష్​ ప్రశ్నలు, 25 జనరల్​ ఆప్టిట్యూడ్​, 25 జనరల్​ నాలెడ్జ్​ ప్రశ్నలు అడుగుతారు. ఆ తర్వాత 25 ప్రశ్నలతో కంప్యూటర్​ పరిజ్ఞానంపై ఆబ్జెక్టివ్​ పరీక్ష ఉంటుంది. దీనికి మొత్తం 2 గంటల సమయం ఉంటుంది. ఇందులో తప్పు సమాధానానికి 1/4 మార్కులు కోత విధిస్తారు.

ఇంగ్లీష్​ టైపింగ్​ పరీక్ష: కంప్యూటర్​పై నిమిషానికి 35 పదాలు తప్పులు లేకుండా టైప్​ చేయాలి (3 శాతం తప్పులను అనుమతిస్తారు). దీనికి 10 నిమిషాల సమయం ఉంటుంది. ఆబ్జెక్టివ్​ టైప్​ పరీక్ష రోజే ఈ టైపింగ్​ పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత ఇంగ్లీష్​లో వ్యాసరూప పరీక్ష ఉంటుంది. దీనికి 2 గంటల సమయం ఇస్తారు. రాత పరీక్ష, కంప్యూటర్​ టెస్ట్​, టైపింగ్​, డిస్క్రిప్టివ్​ టెస్ట్​ల్లో అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు. అందులోనూ మంచి మార్కులు సాధించిన వారిని జూనియర్​ కోర్టు అసిస్టెంట్​లుగా ఎంపిక చేసుకుంటారు.

దరఖాస్తు రుసుము:అర్హులైన అభ్యర్థులు జూనియర్​ కోర్టు అసిస్టెంట్​ పోస్టులకు సుప్రీం కోర్టు వెబ్​సైట్​ www.sci.gov.in. ద్వారా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్​లైన్​ దరఖాస్తులు 2022, జూన్​ 18 నుంచి మొదలయ్యాయి. జనరల్​, ఓబీసీ అభ్యర్థులు దరాఖస్తు రుసుము కింద రూ.500, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్​సర్వీస్​మెన్​, దివ్యాంగులు రూ.250 కట్టాల్సి ఉంటుంది. యూకో బ్యాంకు గేట్​వే ద్వారా రుసుము చెల్లించాలి. ఈ రుసుములను తిరిగి చెల్లించరు. దరఖాస్తు చివరి తేదీ 2022, జులై 10, అర్ధరాత్రి 23.59గా నిర్ణయించారు. పూర్తివివరాల కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

ఇదీ చూడండి:ఉద్యోగాలే ఉద్యోగాలు.. కేంద్ర శాఖల్లో 10లక్షలు.. ఆర్మీలో 45వేలు

ఏపీ, తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలు.. 8వేల పోస్టులకు దరఖాస్తు ఇలా..

Last Updated : Jun 19, 2022, 12:19 PM IST

ABOUT THE AUTHOR

...view details