అభియోగపత్రం(ఛార్జిషీటు) దాఖలు చేసిన తర్వాత బెయిల్ మంజూరు చేయడానికి సంబంధించి సుప్రీంకోర్టు గురువారం మార్గదర్శకాలు(Supreme Court Guidelines On Bail) జారీ చేసింది. విచారణ సమయంలో నిందితుని ప్రవర్తన తీరును పరిగణనలో తీసుకుని తాత్కాలిక ఉపశమనం కల్పించడానికి దిగువ కోర్టులకు అవరోధమేదీ లేదని తెలిపింది. ఈ అంశంలో అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు, సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా చేసిన సూచనల్ని(Supreme Court Guidelines On Bail) జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్‌ల ధర్మాసనం(Supreme Court News) ఆమోదించింది.
నేరాలను నాలుగు విభాగాలుగా వర్గీకరించి, న్యాయస్థానాలకున్న విచక్షణాధికారాలకు భంగం కలగకుండా మార్గదర్శకాలు(Supreme Court Guidelines On Bail) రూపొందించినట్లు ధర్మాసనం తెలిపింది. సాధారణ సమన్లు, బెయిల్‌కు వీలైన వారెంట్లు, నాన్ బెయిలబుల్ వారెంట్లు(ఎన్‌బీడబ్యూ) వంటివి ఎ-విభాగంలో చేర్చింది. ఎన్‌బీడబ్ల్యూలను రద్దు చేయడం, లేదా బెయిల్‌కు వీలున్నవాటిగా మార్చడం గురించి కూడా ప్రస్తావించింది. నేర స్వభావం, శిక్షాకాలం వంటి అంశాల ఆధారంగా మార్గదర్శకాలను విభజించింది. దిగువ న్యాయస్థానాలు వీటిని పరిగణనలో తీసుకుని బెయిల్ దరఖాస్తుల్ని పరిశీలించాలని తెలిపింది.