తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హిజాబ్​ తీర్పుపై త్వరలోనే విచారణ: సుప్రీంకోర్టు - హిజాబ్​ వివాదం

Supreme Court Hijab Case: హిజాబ్​ నిషేధిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్​ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై త్వరలోనే విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు శ్రీరామనవమి రోజు దిల్లీలోని జహంగీర్​పురీ సహా మరో ఏడు రాష్ట్రాల్లో జరిగిన అల్లర్లపై జ్యుడీషియల్​ కమిషన్​ ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్​ను తిరస్కరించింది.

supreme court
hijab

By

Published : Apr 26, 2022, 5:05 PM IST

Supreme Court Hijab Case: విద్యాసంస్థల్లో హిజాబ్​ ధరించడంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్​ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై విచారణ చేపట్టేందుకు న్యాయస్థానం అంగీకరించింది. త్వరలోనే విచారణ చేపట్టాల్సిన పిటిషన్ల జాబితాలో వీటిని చేరుస్తానని సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ స్పష్టం చేశారు. సీనియర్​ న్యాయవాది మీనాక్షి అరోడా ఈ అంశాన్ని ప్రస్తావించగా.. సీజేఐ ఈమేరకు స్పందించారు.

మరోవైపు.. శ్రీ రామనవమి రోజు దిల్లీలోని జహంగీర్​పురీ సహా మరో ఏడు రాష్ట్రాల్లో జరిగిన అల్లర్లపై జ్యుడీషియల్​ కమిషన్​ ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్​ను తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. మధ్యప్రదేశ్​, గుజరాత్​, ఉత్తర్​ప్రదేశ్​లో ప్రభుత్వాలు బుల్​డోజర్లు ఉపయోగించడంపై కూడా కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషన్​లో పేర్కొన్నారు.

ఇదీ చూడండి :4 గంటల్లో 25కి.మీ స్విమ్మింగ్.. సముద్రంలో పదేళ్ల బాలిక సాహసం

ABOUT THE AUTHOR

...view details