కరోనా రెండోదశ విజృంభణను జాతీయ సంక్షోభంగా పేర్కొంది సుప్రీంకోర్టు. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రేక్షకుడిలా చూస్తూ ఉండలేమని వ్యాఖ్యానించింది. అలాగే హైకోర్టుల్లో కరోనా అంశాలపై జోక్యం చేసుకోలేమని పేర్కొంది. రాష్ట్రాల్లోని అంశాలపై హైకోర్టులే నిర్ణయాలు తీసుకుంటాయని స్పష్టం చేసింది.
కరోనా చర్యలపై సుమోటోగా కేసు విచారణ జరిపిన జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఆక్సిజన్ సరఫరా, వైద్య సౌకర్యాలు, ఆస్పత్రుల్లో పడకల పెంపు, రెమ్‌డెసివిర్ లభ్యతతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియపై విచారణ జరుపుతామని తెలిపింది. ఈ అంశాలపై గురువారం సాయంత్రం నాటికి అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.