ఏపీలో పలువురిపై నమోదు చేసిన రాజద్రోహం కేసులపై సుప్రీంకోర్టు విచారణ - treason cases in ap

13:46 May 01
కేంద్రం నియమించిన కమిటీ పురోగతిపై ప్రశ్నించిన సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
SC on Sedition Cases Registered Against Many People in AP : ఆంధ్రప్రదేశ్లో పలువురిపై నమోదు చేసిన రాజద్రోహం కేసులపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసుల విచారణ సందర్భంగా కేంద్రాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. కేంద్రం నియమించిన కమిటీ పురోగతిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించారు. ఐపీసీ సెక్షన్ 124ఏ తొలగింపు అంశంపై కేంద్రం ఓ కమిటీని నియమించింది. సెక్షన్ 124ఏ ను తొలగిస్తామని గతంలో కోర్టుకు తెలిపింది. గత కేసులకు వర్తింపచేయాలా వద్దా అనేదానిపై ఇంకా నిర్ణయించలేదని కేంద్రం తెలిపింది. చట్టాన్ని కేంద్రం తొలగించకపోతే తామే నిర్ణయం తీసుకుంటామన్న సీజేఐ.. రాజద్రోహం కేసులపై విచారణ వాయిదా వేసింది.
రాజద్రోహంపై సుప్రీం స్టే:అత్యంత వివాదాస్పదమైన రాజద్రోహ చట్టంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం చరిత్రాత్మక నిర్ణయాన్ని వెలువరించింది. ఈ నేరారోపణతో జైళ్లలో మగ్గుతున్న వారికి ఊరటను కల్పించింది. విచక్షణారహితంగా నమోదవుతున్న కేసులకు ముకుతాడు బిగించింది. భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 124ఎ నిబంధనపై కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్ష జరిపి తదుపరి నిర్ణయం తీసుకునేంత వరకు దాని అమలును నిలిపేస్తూ 2022 మే 11న కీలకమైన ఆదేశాలిచ్చింది.
ఇవీ చదవండి:
TAGGED:
SC on Sedition Cases