తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు రెండు నెలలు పొడిగింపు - అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై ఉత్కంఠ

sc on sunitha petition
sc on sunitha petition

By

Published : Apr 24, 2023, 10:19 AM IST

Updated : Apr 24, 2023, 3:44 PM IST

15:43 April 24

అవినాష్‌ ముందస్తు బెయిల్‌ ఉత్తర్వులను నిలిపివేసిన సుప్రీంకోర్టు

  • అవినాష్‌ ముందస్తు బెయిల్‌ ఉత్తర్వులను నిలిపివేసిన సుప్రీంకోర్టు
  • వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు రెండు నెలలు పొడిగింపు
  • రేపటివరకు అరెస్టు చేయవద్దని కోరిన అవినాష్‌ న్యాయవాదులు
  • రేపు హైకోర్టులో కేసు విచారణ ఉన్నందున అప్పటివరకు అరెస్టు చేయవద్దని విజ్ఞప్తి
  • అలాంటి ఆదేశాలను ఇవ్వలేమన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
  • మీ విజ్ఞప్తిని మన్నిస్తే ఉత్తర్వులు పరస్పరం విరుద్ధంగా ఉంటాయన్న సీజేఐ
  • తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను పూర్తిగా పక్కన పెట్టిన సుప్రీంకోర్టు
  • తెలంగాణ హైకోర్టు అలాంటి ఉత్తర్వులు జారీచేయకూడదు: సుప్రీంకోర్టు
  • హైకోర్టు ఆదేశాల వల్ల సీబీఐ దర్యాప్తుపైనా ప్రభావం పడుతుంది: సుప్రీంకోర్టు
  • వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు గడువు 2 నెలలు పొడిగింపు: సుప్రీంకోర్టు
  • జూన్‌ నెలాఖరు వరకు సీబీఐ దర్యాప్తు గడువు పొడిగింపు: సుప్రీంకోర్టు
  • సీబీఐకి అలాంటి నిబంధనలు విధించడం సరైన చర్య కాదు: సుప్రీంకోర్టు

15:22 April 24

సునీత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు

  • సునీత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు
  • ఆర్డర్‌ చదువుతున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
  • సునీత తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు
  • అవినాష్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు
  • అఫిడ‌విట్‌ను అవినాష్‌ ఉపసంహరించుకోవాలని సూచించిన సీజేఐ
  • హైకోర్టులో వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ వెనక్కి తీసుకోవాలన్న సుప్రీం
  • సాక్ష్యాల‌ను అవినాష్‌ నాశ‌నం చేసేందుకు యత్నించాడన్న సిద్ధార్థ లూథ్రా
  • సి.ఐ. శంక‌ర‌య్య త‌న వాంగ్మూలంలో అదే చెప్పారన్న సిద్ధార్థ లూథ్రా
  • అవినాష్‌కు ప్రశ్నలు ముందే ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు చెప్పింది: లూథ్రా
  • తెలంగాణ హైకోర్టు ఇలా చెప్పడం గతంలో ఎప్పుడూ లేదు: లూథ్రా
  • తెలంగాణ హైకోర్టు అలా చెప్పలేదని వాదించిన ముకుల్ రోహత్గీ
  • తెలంగాణ హైకోర్టు ఆదేశాలను త‌ప్పుగా అర్థం చేసుకున్నార‌న్న రోహత్గీ
  • అవినాష్‌ పాత్ర ఉందని సీబీఐ స్పష్టంగా చెప్పింది: సీజేఐ
  • హైకోర్టు ప్రాథమిక స్థాయిలో ఎలా జోక్యం చేసుకుంటుంది?: సీజేఐ
    సీబీఐ పని కూడా తెలంగాణ హైకోర్టు చేస్తే ఎలా?: సీజేఐ చంద్రచూడ్‌

15:10 April 24

సునీత తరఫున వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా

  • సునీత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో కొనసాగుతున్న విచారణ
  • సునీత తరఫున వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా
  • అవినాష్‌ తరఫున వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ
  • అవినాష్‌కు ముందస్తు బెయిల్‌ ఇవ్వడంపై సుప్రీంకోర్టుకు వెళ్లిన సునీత
  • తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకు వెళ్లిన సునీత
  • అవినాష్‌ను ఈనెల 25 వరకు అరెస్టు చేయవద్దన్న తెలంగాణ హైకోర్టు

14:17 April 24

సునీత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం

  • సునీత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం
  • అవినాష్‌ లాయర్‌ మరో కేసులో బిజీగా ఉన్నందున విచారణ ఆలస్యంగా ప్రారంభమైంది
  • తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకు వెళ్లిన సునీత
  • అవినాష్‌ను ఈనెల 25 వరకు అరెస్టు చేయవద్దన్న తెలంగాణ హైకోర్టు
  • సునీత వేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు
  • తుది విచారణ నేటికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు సీజే ధర్మాసనం

12:49 April 24

సునీత పిటిషన్‌పై విచారణను మ.2 గం.కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

  • సునీత పిటిషన్‌పై విచారణను మ.2 గం.కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
  • అవినాష్‌ లాయర్‌ రంజిత్‌ మరో కేసులో బిజీగా ఉన్నందున విచారణ వాయిదా

10:16 April 24

ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌పై కాసేపట్లో సుప్రీంకోర్టులో కీలక విచారణ

  • ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌పై కాసేపట్లో సుప్రీంకోర్టులో కీలక విచారణ
  • వైఎస్‌ వివేకా కుమార్తె సునీత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
  • తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంను ఆశ్రయించిన సునీత
  • అవినాష్ రెడ్డిని ఈనెల 25 వరకు అరెస్టు చేయవద్దన్న తెలంగాణ హైకోర్టు
  • సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు
  • తుది విచారణ నేటికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు సీజే ధర్మాసనం
  • సునీత పిటిషన్ విచారణ అనంతరం కీలక ఆదేశాలిచ్చిన సీజేఐ
  • తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధించిన సుప్రీంకోర్టు

09:22 April 24

నేటితో ముగియనున్న భాస్కర్ రెడ్డి, ఉదయ్ రెడ్డి కస్టడీ

  • వివేకా హత్య కేసులో నేటితో ముగియనున్న భాస్కర్ రెడ్డి, ఉదయ్ రెడ్డి కస్టడీ
  • ఆరు రోజుల కస్టడీలో భాగంగా నేడు చివరి రోజు విచారించనున్న సీబీఐ
  • భాస్కర్ రెడ్డి, ఉదయ్ రెడ్డిని సీబీఐ కార్యాలయంలో విచారించనున్న సీబీఐ
  • కాసేపట్లో చంచల్‌గూడ జైలు నుంచి సీబీఐ కార్యాలయానికి తరలింపు
  • విచారణ తర్వాత సీబీఐ జడ్జి ముందుకు భాస్కర్ రెడ్డి, ఉదయ్ రెడ్డి

09:14 April 24

  • పులివెందులకు అదనపు పోలీసు బలగాలు
  • సునీత వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారణ
  • అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు రద్దుపై నిర్ణయం తీసుకోనున్న సుప్రీంకోర్టు
  • ముందస్తుగా పులివెందులకు చేరుకున్న స్పెషల్ పార్టీ పోలీసులు
  • ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి వద్ద బందోబస్తు
  • పులివెందులలోని కూడళ్లలో స్పెషల్ పార్టీ పోలీసుల పహారా
  • అవాంఛనీయ ఘటనలు జరగకుండా రంగంలోకి పోలీసు బలగాలు
Last Updated : Apr 24, 2023, 3:44 PM IST

ABOUT THE AUTHOR

...view details