తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరో 3 ప్రాంతాల్లో సుప్రీం కోర్టు బెంచ్​లు- నిజమేనా? - fake news over sc benches news

సుప్రీంకోర్టు బెంచ్​లను మరో మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించలేదని ప్రెస్​ ఇన్​ఫర్మేషన్​ బ్యూరో(పీఐబీ) స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి.. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తి అవాస్తవమని చెప్పింది.

sc new benches
సుప్రీంకోర్టు నూతన బెంచ్​లు

By

Published : Aug 11, 2021, 9:15 PM IST

దేశంలో మరో మూడు ప్రాంతాల్లో సుప్రీంకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పీఐబీ) ఖండించింది. సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తిలో ఉన్న ట్వీట్‌ నకిలీదని.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ట్విట్టర్‌ వేదికగా తెలిపింది.

"సర్వోన్నత న్యాయస్థానం బెంచ్‌లను మరో మూడు ప్రదేశాలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు.. జరుగుతున్న ప్రచారం అవాస్తవం. ప్రభుత్వం అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదు."

-ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో

దిల్లీ వెలుపల సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్‌లను ఏర్పాటు చేయాలనే ఆలోచన లేదని కేంద్రం ఇప్పటికే పార్లమెంట్‌కు తెలిపింది. గత ఏడాది లోక్‌సభలో ఈ విషయంపై ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు.. అప్పటి న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో సుప్రీం బెంచ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయని.. కానీ ప్రత్యేక బెంచ్‌ల ఏర్పాటుకు సుప్రీంకోర్టు అనుకూలంగా లేదని రవిశంకర్‌ ప్రసాద్‌ వెల్లడించారు.

ఇదీ చూడండి:ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాలుగేళ్ల స్ఫూర్తి ప్రయాణం

ఇదీ చూడండి:ఓబీసీ బిల్లుకు పార్లమెంటు ఆమోదం

ABOUT THE AUTHOR

...view details