తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈడబ్ల్యూఎస్ కోటాపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వు - SC reservation verdict

Supreme Court EWS reservation: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనుంది. గురువారం విచారణ జరిపిన ధర్మాసనం.. తీర్పును రిజర్వు చేసింది. వాద, ప్రతివాదులు తమ అభిప్రాయాలను గురువారం సాయంత్రంలోగా కోర్టుకు తెలపవచ్చని సుప్రీం పేర్కొంది.

NEET EWS ORDER
NEET EWS ORDER

By

Published : Jan 7, 2022, 5:00 AM IST

Supreme Court EWS reservation: నీట్‌-పీజీ కౌన్సిలింగ్‌లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్ల అమలుపై దాఖలైన పిటిషన్లపై తీర్పును రిజర్వు చేస్తున్నట్లు దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. గురువారం సాయంత్రంలోగా వాద ప్రతివాదులు తమ అభిప్రాయాలను కోర్టుకు తెలపవచ్చని జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ బోపన్నలతో కూడిన ధర్మాసనం సూచించింది. లిఖిత పూర్వకంగా తమ అభిప్రాయాలను తెలపాలని పిటిషనర్లను ఆదేశించింది.

EWS quota NEET admissions

నీట్‌ అడ్మిషన్లకు సంబంధించి ఈడబ్ల్యూఎస్ కోటా అమలుపై దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పలు పటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై గురువారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం తమ అభ్యర్థనలను కోర్టుకు తెలపాలని పిటిషనర్లను ఆదేశించింది.

రూ.8 లక్షలు.. ఓకే!

ఈ పిటిషన్లపై అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం.. ఈ విద్యా సంవత్సరానికి ఈడబ్ల్యూఎస్‌ కోటాలో పేర్కొన్న వార్షిక ఆదాయ పరిమితిని రూ.8 లక్షలుగానే ఉంచనున్నట్లు మంగళవారం స్పష్టం చేసింది. అడ్మిషన్లు, సీట్ల కేటాయింపు కొనసాగుతున్న ఈ సమయంలో నిబంధనల్ని మార్చడం వల్ల తీవ్ర పరిణామాలుంటాయని పేర్కొంది. వచ్చే సంవత్సరం సవరణలు చేస్తామని తెలిపింది. ఈ వివాదంపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సులను అంగీకరిస్తున్నామని అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది.

సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీ మేరకు.. గతేడాది నవంబర్​ 30న కేంద్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించింది. మాజీ ఆర్థిక కార్యదర్శి అజయ్​ భూషణ్​ పాండే, ఐసీఎస్​ఎస్​ఆర్​ మెంబర్​ సెక్రటరీ వీకే మల్హోత్రా, కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్​ సన్యాల్​ సభ్యులు. గతేడాది డిసెంబర్​ 31న కమిటీ తమ నివేదికను సమర్పించింది.

కమిటీ నివేదిక ప్రకారం..

  • రిజర్వేషన్లు పొందడానికి వార్షిక ఆదాయ పరిమితి రూ.8 లక్షలుగా కొనసాగనుంది.
  • ఐదు ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులకు మాత్రం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ వర్తించదు.
  • ఈ సిఫార్సులు ప్రస్తుతం కొనసాగుతున్న అడ్మిషన్‌ ప్రక్రియను మాత్రం ప్రభావితం చేయబోవని కమిటీ స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:'మోదీ పంజాబ్ ఘటన'పైనే కేబినెట్ చర్చ.. కఠిన చర్యలకు డిమాండ్!

ABOUT THE AUTHOR

...view details