Vivekananda Reddy Murder Case Updates: మాజీ మంత్రి వివేకా హత్య కేసుకు సంబంధించి.. ఆయన (వివేకా) మాజీ వ్యక్తిగత సహాయకుడు ఎం.వి.కృష్ణా రెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారేందుకు అనుమతించాలంటూ ఆయన కోరిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎం.వి.కృష్ణా రెడ్డి పిటిషన్‌పై నేడు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఈ కేసులో జోక్యానికి సిద్ధంగా లేమని స్పష్టం చేసింది. వాద, ప్రతివాదుల అభిప్రాయాలు తెలంగాణ హైకోర్టు ముందే చెప్పొచ్చని సూచించింది. సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయాలతో సంబంధం లేకుండా.. హైకోర్టు స్వతంత్రంగా తగిన నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు గురువారం రోజున లిఖితపూర్వక ఆదేశాలు ఇస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది.
SC on Viveka PA Petition: వివేకా హత్య కేసు.. పీఏ కృష్ణారెడ్డి పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు - SC on Viveka PA Petition
13:42 July 05
లిఖితపూర్వక ఆదేశాలు రేపు ఇస్తామన్న సుప్రీంకోర్టు ధర్మాసనం
బాధితుడిగా గుర్తించాలని పిటిషన్: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి.. తనను బాధితుడిగా గుర్తించాలంటూ వివేకా పీఏ కృష్ణారెడ్డి ఇటీవలే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌లో.. వివేకా హత్యపై తొలుత ఫిర్యాదు చేసింది తానేనని, అందుకు తనను బాధితుడిగా గుర్తించాలని న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేస్తూ.. మిస్లేనియస్ అప్లికేషన్ దాఖలు చేశారు. తన పిటిషన్‌లో పేర్కొన్న విషయాలను పరిగణించేలా న్యాయస్థానం స్పష్టత ఇవ్వాలని కోరారు. అయితే, ఆ వాదనలను వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత వ్యతిరేకించగా.. సుప్రీంకోర్టు సీబీఐతోపాటు, ప్రతివాదిగా ఉన్న షేక్ దస్తగిరికి కూడా నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రెండు రోజులక్రితం (సోమవారం) ఈ కేసుపై విచారించిన ధర్మాసనం.. సునీత తరుఫు న్యాయవాది వాదనల అనంతరం తదుపరి విచారణను నేటికి (బుధవారం) వాయిదా వేసింది.
గత విచారణలో వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత తరుఫు న్యాయవాది న్యాయస్థానంలో వాదనలు వినిపిస్తూ.. ఇటీవల సీబీఐ మరో చార్జిషీటు దాఖలు చేసిందని ధర్మాసనానికి తెలిపారు. ఆ చార్జిషీటులో కృష్ణారెడ్డికి సంబంధించిన వివరాలు ఉన్నాయని వివరించారు. కృష్ణా రెడ్డికి సంబంధించిన అదనపు సమాచారాన్ని కూడా కోర్టు ముందు ఉంచుతామని సునీత న్యాయవాది ధర్మాసనానికి తెలియజేశారు. దీంతో సునీత తరుఫు న్యాయవాది వాదనలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. కేసు విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తనను బాధితుడిగా పరిగణించాలంటూ పీఏ కృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌ను నేడు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపి, కొట్టివేసింది. ఈ కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని సవాల్ చేసే అధికారం తనకు కూడా ఉన్నట్లు ఆదేశాలు ఇవ్వాలన్న ఆయన అభ్యర్థను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ కేసులో జోక్యానికి సిద్ధంగా లేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. వాద, ప్రతివాదుల అభిప్రాయాలు హైకోర్టు ముందే చెప్పుకోవాలని సూచించింది. దీనిపై తమ అభిప్రాయాలతో సంబంధం లేకుండా హైకోర్టు స్వతంత్రంగా తగిన నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. రేపు దీనిపై లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇస్తామని తెలిపింది.