arya samaj marriage news: ఆర్య సమాజ్ జారీచేసిన వివాహ ధ్రువపత్రాలకు చట్టబద్ధమైన గుర్తింపు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వివాహ ధ్రువపత్రాలు జారీ చేసే అధికారం ఆర్య సమాజ్‌కు లేదన్న ధర్మాసనం.. సంబంధిత అధికారులు జారీచేసిన వివాహ ధ్రువపత్రాలు మాత్రమే చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. అలాంటి వాటినే సమర్పించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఆర్య సమాజ్ వివాహ ధ్రువపత్రాలు చెల్లవు: సుప్రీం - ఆర్యసమాజ్ న్యూస్
arya samaj marriage news: ఆర్య సమాజ్ జారీ చేసిన వివాహ ధ్రువపత్రాలపై సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆర్య సమాజ్ జారీ చేసే ధ్రువపత్రాలకు చట్టబద్ధమైన గుర్తింపు ఇచ్చేందుకు నిరాకరించింది.
మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ ప్రేమ వివాహానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మైనర్ అయిన తమ కుమార్తెను ఓ యువకుడు అపహరించి అత్యాచారం చేసినట్లు పేర్కొన్న అమ్మాయి తల్లిదండ్రులు.. అతనిపై లైంగిక వేధింపుల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే పోస్కో చట్టం ప్రకారం కేసు పెట్టారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన యువకుడు మేజర్ అయిన అమ్మాయి ఇష్టపూర్వకంగానే ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నట్లు తెలిపాడు. ఈ మేరకు ఆర్యసమాజ్ జారీచేసిన వివాహ ధ్రువపత్రం సమర్పించగా సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించింది.
ఇదీ చదవండి:వధువు, వరుడు రెండూ ఆమెనే.. బిందు 'వింత పెళ్లి' కథేంటి?