తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బ్యాంకులో ఖాతా ఉన్నా.. వారికి ఆ హక్కులు ఉండవ్!' - వినియోగదారుల రక్షణ చట్టంపై సుప్రీంకోర్టు

Supreme Court Consumer: బ్యాంకు వినియోగాదారుడి నిర్వచనాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వాణిజ్య ప్రయోజనం కోసం బ్యాంకు సేవలు పొందుతున్న వ్యక్తి వినియోగదారుడు కాదని పేర్కొంది. ఆ వ్యక్తి వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలోకి రాడని స్పష్టం చేసింది.

Supereme court consumer
Supereme court consumer

By

Published : Feb 23, 2022, 5:05 PM IST

Supreme Court Consumer: వాణిజ్య ప్రయోజనం కోసం బ్యాంకు సేవలు పొందే వ్యక్తి వినియోగదారుడు కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. వినియోదారుల రక్షణ చట్టం ప్రకారం ఆ వ్యక్తి వినియోగదారుడి పరిధిలోకి రాడని స్పష్టం చేసింది. వినియోగదారుని పరిధిలోకి రావాలంటే.. ఓ వ్యక్తి స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పొందడం కోసం ప్రత్యేకంగా సేవలు పొందినట్లు నిర్ధరించాల్సి ఉంటుందని సర్వోన్నతన్యాయస్థానం తెలిపింది.

అటువంటి వాణిజ్య లావాదేవీలను వినియోగదారుల రక్షణ (సవరణ) చట్టం-2002 పరిధిలోకి రాకుండా చేయడమే చట్ట సవరణ ప్రధాన ఉద్దేశమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఓ వ్యక్తి స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి కోసం ప్రత్యేకంగా వాణిజ్య వస్తువులు లేదా సేవలను వినియోగించుకోవడానికి వెసులుబాటు కల్పించడం కూడా ఈ చట్టం ఉద్దేశాల్లో ఒకటని తెలిపింది. ఓ కేసు విచారణలో భాగంగా జస్టిస్​ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్​ బీఆర్ గవాయ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది.

పిటిషనర్​ శ్రీకాంత్ జీ మంత్రి ఘర్​​.. తనకు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కల్పించిన పంజాబ్​ నేషనల్​​ బ్యాంక్‌పై జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్​కు(ఎన్​సీడీఆర్​సీ)​ ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఎన్​సీడీఆర్​సీ.. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్-1986లోని సెక్షన్​ 2(1)(డీ) ప్రకారం పిటిషనర్​ వినియోగదారుడు పరిధిలోకి రాడని తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ శ్రీకాంత్​.. సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అయితే ఎన్​సీడీఆర్​సీ తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ఆ లావాదేవీలు వాణిజ్య ప్రయోజనం పరిధిలోకి వస్తాయని ధర్మాసనం తీర్పులో పేర్కొంది.

ఇదీ చూడండి:'దావూద్​' కేసులో మహారాష్ట్ర మంత్రి నవాబ్​ మాలిక్​ అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details