తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొలీజియం సిఫార్సుల విషయంలో కేంద్రంపై సుప్రీం ఫైర్​- నచ్చిన పేర్ల ఎంపిక విధానం వద్దంటూ! - కేంద్రానికి సుప్రీంకోర్టు సూటి ప్రశ్న

Supreme Court Collegium News : హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల విషయంలో కొలీజియం పంపిన సిఫార్సులపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. మీకు నచ్చిన వారినే ఎంపిక చేయడం సరికాదంటూ సోమవారం హితవు పలికింది. ఇది మంచి పరిణామం కాదని స్పష్టంచేసింది.

Supreme Court Collegium News
Supreme Court Collegium News

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2023, 8:23 AM IST

Updated : Nov 21, 2023, 9:18 AM IST

Supreme Court Collegium News : హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల విషయంలో కొలీజియం పంపిన సిఫారసులపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. తాము చేసిన సిఫార్సుల్లో కొన్ని పేర్లకే ఆమోదం చెబుతూ అభీష్టానికి తగ్గట్లు ఎంపిక విధానాన్ని కేంద్రం పాటిస్తోందని వ్యాఖ్యానించింది. న్యాయమూర్తుల ఎంపిక, బదిలీల కోసం కొలీజియం సిఫార్సులకు ఆమోదం తెలపడంలో కేంద్రం జాప్యం చేస్తోందంటూ దాఖలైన రెండు పిటిషన్లపై జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ సుధాంశు ధులియాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఈ పద్ధతిలో నియామకాలు చేపట్టడం ద్వారా న్యాయమూర్తులు సీనియార్టీని కోల్పోతారని అభిప్రాయపడింది.

'ఇది మంచి పరిణామం కాదు..'
నచ్చిన పేర్ల ఎంపిక విధానం వద్దంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. బదిలీ కోసం 11మంది జడ్జీల పేర్లను కొలీజియం సిఫార్సు చేయగా అందులో అయిదుగురే బదిలీ అయ్యారని.. ఆరు పేర్లు ఇంకా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. ఇది మంచి పరిణామం కాదని కొలీజియం సభ్యుడైన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ వ్యాఖ్యానించారు. గతంలోనూ ఈ విషయం చెప్పానంటూ అటార్నీ జనరల్‌ వెంకటరమణిని ఉద్దేశించి జస్టిస్‌ కౌల్​ పేర్కొన్నారు.

"హైకోర్టు జడ్డీల నియామకాల విషయంలో కేంద్ర ప్రభువ్వం అవలంబిస్తున్న విధానం సరైంది కాదు. ఇది మంచి పరిణామం కాదని మీకు గతంలోనూ చెప్పా. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వం ఎలాంటి సంకేతాలు ఇవ్వదల్చుకుంది."
- జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, కొలీజియం సభ్యులు

'అందుకు ఎవరైనా ఎందుకు ఒప్పుకుంటారు?'
వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లో జడ్జీల నియామకం కోసం ఇటీవలే కొలీజియం సిఫార్సు చేసిన 8 మంది పేర్లు ఇంకా పెండింగ్​లోనే ఉన్నాయనే విషయం కూడా ధర్మాసనం గుర్తుచేసింది. వారిలో కొందరు ఇప్పటికే నియమితులైనవారి కన్నా సీనియర్లని పేర్కొంది. 'జడ్జీలుగా నియమితులు కావడానికి ఎవరైనా ఎందుకు ఒప్పుకుంటారు? ఇదే విషయంపై మేం గతంలోనూ పలు కీలక సూచనలు చేశాం. న్యాయమూర్తిగా తనను ఏ సీనియార్టీలో ఉంచుతారన్నది ఒక అభ్యర్థికి కచ్చితంగా తెలియాలి. లేదంటే అర్హులైన అభ్యర్థులను ఒప్పించడం కష్టతరంగా మారుతుంది' అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

'కొంత పురోగతి ఉంది..'
ఈ సందర్భంగా అంతకుముందు చేసిన కొన్ని పాత సిఫార్సులనూ ధర్మాసనం ప్రస్తావించింది. వాటిలో కొందరి పేర్లను ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్రతిపాదించామని తెలిపింది. అయితే మళ్లీ అవే పేర్లను ప్రతిపాదిస్తూ కొలీజియం చేసిన సిఫార్సులకు ఆమోదం తెలిపే ప్రక్రియలో కొంత పురోగతి ఉందని అటార్నీ జనరల్‌ వెంకటరమణి వివరించారు. అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల 5కు వాయిదా వేసింది సుప్రీం.

సొరంగంలోకి DRDO రోబోలు- వెంటిలేషన్​ సహా కూలీలకు ఆహారం అందజేత!

కూలీలకు వేడివేడి కిచిడీ- బాటిళ్లలో నింపి లోపలకు- సొరంగంలోని కార్మికుల లైవ్​ వీడియో

Last Updated : Nov 21, 2023, 9:18 AM IST

ABOUT THE AUTHOR

...view details