తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సాగు చట్టాలపై సుప్రీంకు త్రిసభ్య కమిటీ నివేదిక - రైతు సంఘాలతో చర్చలు

సాగు చట్టాలపై సుప్రీంకోర్టు నియమిత త్రిసభ్య కమిటీ నివేదిక సమర్పించింది. 85 రైతు సంఘాలతో చర్చలు జరిపినట్లు వెల్లడించిన కమిటీ సీల్డ్‌ కవర్‌లో తన నివేదిక సమర్పించింది. ఈ మేరకు పరిష్కారం కోసం రైతు సంఘాలతో చర్చలు జరిపినట్లు కమిటీ తెలిపింది.

SC backed panel submits report on farm laws
సాగు చట్టాలపై నివేదిక సమర్పించిన సుప్రీంకోర్టు నియమిత కమిటీ

By

Published : Mar 31, 2021, 5:49 PM IST

Updated : Mar 31, 2021, 6:19 PM IST

నూతన సాగు చట్టాలపై సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ.. తన నివేదికను సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించింది. ఈ మేరకు కమిటీ తన నివేదికను సీల్డ్‌ కవర్‌లో ఉంచి సుప్రీంకోర్టుకు సమర్పించింది.

సాగు చట్టాలపై నెలకొన్న ప్రతిష్టంభనకు పరిష్కారం కోసం దాదాపు 85 రైతు సంఘాలతో చర్చలు జరిపినట్లు కమిటీ వెల్లడించింది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు, ప్రభుత్వానికి మధ్య చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కమిటీని నియమించింది.

మొదట నలుగురు సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేయగా.. దీనిలో కొనసాగలేనంటూ ఓ సభ్యుడు వైదొలిగారు. చివరకు ముగ్గురు సభ్యుల కమిటీ ఈ అంశంపై రైతులతో చర్చలు జరిపి, తాజాగా నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది.

హోలీ సెలవుల తర్వాత ఏప్రిల్ 5న తిరిగి ప్రారంభం కానున్న సుప్రీంకోర్టు.. అదే రోజు సాగు చట్టాల అంశంపై విచారణ జరపనుంది. 4 నెలలకు పైగా దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు.. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ముందుకు వెళ్లేదే లేదని గతంలో చెప్పారు. ఇప్పుడు.. సమస్య పరిష్కారానికి త్రిసభ్య కమిటీ నివేదికలో పేర్కొన్న ప్రతిపాదనలపై ఉత్కంఠ నెలకొంది

ఇదీ చదవండి:రైతుల హోలీ వేడుకలు- సాగు చట్టాల ప్రతులు దహనం!

Last Updated : Mar 31, 2021, 6:19 PM IST

ABOUT THE AUTHOR

...view details