దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన పెగసస్ స్పైవేర్‌తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై (Pegasus Supreme Court) సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపేందుకు ముగ్గురు సభ్యులతో స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్.వి. రవీంద్రన్.. ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారని పేర్కొంది. నిపుణుల కమిటీ పనితీరును (Pegasus Supreme Court) తామే పర్యవేక్షిస్తామని స్పష్టం చేసింది. పెగాసస్‌పై వచ్చిన ఆరోపణలను క్షుణ్ణంగా పరిశీలించి.. నివేదికను కోర్టుకు సమర్పించాలని కమిటీని ఆదేశించింది. వ్యక్తుల గోప్యత హక్కు ఉల్లంఘన జరిగిందా లేదా అనే విషయాన్ని ఈ కమిటీ పరిశీలిస్తుందని పేర్కొంది.
తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా..
విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. తప్పనిసరి పరిస్థితుల దృష్ట్యా ఈ కమిటీని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని తెలిపింది. దేశ పౌరులపై వివక్షాపూరితమైన నిఘాను (Pegasus Supreme Court) తాము ఎన్నటికీ అనుమతించబోమని స్పష్టం చేసింది. ప్రస్తుత సాంకేతిక శకంలో టెక్నాలజీ ఎంత ముఖ్యమో.. వ్యక్తలు గోప్యత హక్కును కాపాడుకోవడం కూడా అంతే ప్రధానమనే విషయాన్ని గుర్తించాలని పేర్కొంది. పెగసస్ స్పైవేర్‌తో పౌరులపై నిఘా పెట్టడం సహా., ఇందులో విదేశీ సంస్థల ప్రమేయం ఉండటంపై ఆందోళన వ్యక్తం చేసింది.
చాలా అవకాశాలు ఇచ్చాం..