తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పిజ్జా తింటే వార్తగా నిలుస్తుందా?' - floods to protesting farmers over pizza eating Diljit

దిల్లీలో నిరసన చేస్తున్న రైతులు పిజ్జా తినడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో స్పందించిన పలువురు ప్రముఖులు.. రైతులకు మద్దతుగా నిలిచారు. రైతులు విషం తింటే ఆందోళన ఉండదు కానీ.. పిజ్జా తింటే వార్తగా నిలుస్తోందంటూ ఎద్దేవా చేశారు. రైతులకు మద్దతుగా మరోసారి లంగర్ కార్యక్రమం ఏర్పాటు చేసి పిజ్జా, బర్గర్లు అందిస్తామని తెలిపారు.

Support floods to protesting farmers over pizza eating Diljit Dosanjh joins
పిజ్జా తింటే వార్తగా నిలుస్తుందా?

By

Published : Dec 15, 2020, 3:59 AM IST

Updated : Dec 15, 2020, 7:25 AM IST

నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ హరియాణా, పంజాబ్‌ తదితర రాష్ట్రాల రైతులు దిల్లీ శివార్లలో నిరవధిక నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం, ఆందోళనకారుల మధ్య జరిగిన చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడటం వల్ల ఆందోళన గత 19 రోజులుగా కొనసాగుతోంది. అతి శీతల వాతావరణంలో బహిరంగ నిరసనలో పాల్గొంటున్న వీరికి పలువురు సహాయంగా నిలుస్తున్నారు. వీరికి అవసరమైన ఏర్పాట్లను, వస్తువులను అందచేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు దాతలు రైతులకు పిజ్జాలను పంచారు. అయితే రైతులు పిజ్జా తినటంపై కొంతమంది విమర్శలు చేశారు. ఈ వైఖరిపై పలువురు నిరసన వ్యక్తం చేశారు. బాలీవుడ్‌ నటుడు, గాయకుడు దిల్జీజ్‌ దొసాంజ్‌ రైతులకు మద్దతు పలికారు. "వ్యవసాయదారులు విషం తింటే ఎవరికీ ఆందోళన లేదు.. కానీ వారు పిజ్జా తింటే అది వార్తగా నిలుస్తుంది!" అని ఉన్న ఓ చిత్రాన్ని ఆయన ట్వీట్ చేశారు.

పిజ్జాకు గోధుమలు అందించేది వారే..

షాన్‌బీర్‌ సింగ్‌ సంధూ అనే యువకుడు, నలుగురు స్నేహితులతో కలిసి గతవారం 'పిజ్జా లంగర్‌' కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా 400కు పైగా పిజ్జాలను నిరసన కారులకు అందచేశారు. రైతుల కోసం పప్పు, చపాతీలతో కూడిన భోజనాన్ని ఏర్పాటు చేసేందుకు చాలినంత సమయం లేకపోవటంతో తమకు ఈ ఆలోచన వచ్చిందని ఆయన వివరించారు. పిజ్జా తయారీకి కావాల్సిన గోధుమలను అందించే రైతులు.. పిజ్జాను ఎందుకు తినకూడదంటూ షాన్‌బీర్‌ సింగ్‌ ప్రశ్నించారు. గురునానక్‌ దేవ్‌ విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదువుతున్న తాను కూడా వ్యవసాయదారుడినే అని ఆయన తెలిపారు.

వెల్లువెత్తుతున్న మద్దతు

తాము మరోసారి మరింత పెద్ద అన్నదాన లంగర్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని ఆ యువకులు ప్రకటించారు. ఈసారి దానిలో పిజ్జా, బర్గర్‌ లాంటివి మరెన్నో పంచిపెడతామని వారు వివరించారు. నిరసన చేస్తున్న వేలాది రైతులకు సహాయం చేసేందుకు భారీగా దాతలు ముందుకొస్తున్నారు. వారికి ఆహారం, నిద్రపోయేందుకు సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. గంటలో 1500 నుంచి 2000 చపాతీలను తయారు చేయగల యంత్రాలను భారీ సంఖ్యలో ఏర్పాటు చేశారు. 'ఖల్సా ఎయిడ్‌' అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ వారికోసం కాళ్లను మర్దన చేసే (ఫుట్‌ మాసేజ్‌) యంత్రాలను ఏర్పాటు చేసింది.

వెల్లువెత్తుతున్న మద్దతు

తాము మరోసారి మరింత పెద్ద అన్నదాన లంగర్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని ఆ యువకులు ప్రకటించారు. ఈసారి దానిలో పిజ్జా, బర్గర్‌ లాంటివి మరెన్నో పంచిపెడతామని వారు వివరించారు. నిరసన చేస్తున్న వేలాది రైతులకు సహాయం చేసేందుకు భారీగా దాతలు ముందుకొస్తున్నారు. వారికి ఆహారం, నిద్రపోయేందుకు సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. గంటలో 1500 నుంచి 2000 చపాతీలను తయారు చేయగల యంత్రాలను భారీ సంఖ్యలో ఏర్పాటు చేశారు. 'ఖల్సా ఎయిడ్‌' అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ వారికోసం కాళ్లను మర్దన చేసే (ఫుట్‌ మాసేజ్‌) యంత్రాలను ఏర్పాటు చేసింది.

అన్నదాత క్షమాపణ...

కేంద్రం తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న రైతులు సోమవారం దేశవ్యాప్తంగా ధర్నాలు, రిలే నిరాహార దీక్షలతో హోరెత్తించారు. ఈ చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. 32 సంఘాల ఆధ్వర్యంలో దిల్లీ సమీపంలోని సింఘు వద్ద రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాహార దీక్ష చేశారు. దేశ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో..రైతుల నిరసనకు మద్దతు తెలిపారు. నూతన సాగుచట్టాలు రద్దు చేసేవరకు వెనక్కి తగ్గేది లేదన్న రైతు సంఘాల నేతలు కేంద్రం మొండి వైఖరి వీడాలన్నారు. వ్యవసాయ చట్టాలపై ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్న వారితో తమకు సంబంధం లేదన్నారు. అటు ఉద్యమంలో భాగంగా కొన్ని ప్రధానమైన రహదారులను రోజుల తరబడి స్తంభింపజేయాల్సి రావడంపై రైతు సంఘాలు ప్రజల్ని చేతులు జోండిచి క్షమాపణ కోరాయి. రహదారుల దిగ్బంధం ప్రజలకు అసౌకర్యమే అయినా తప్పనిసరి పరిస్థితుల్లోనే అలా చేయాల్సి వచ్చిందన్నాయి. ఆంబులెన్స్‌లు, వృద్ధులు ఆందోళన చేపడుతున్న మార్గాల్లో ఇరుక్కుపోతే తక్షణ సాయం కోసం వాలంటీర్ల దృష్టికి తీసుకురావాలని కోరారు.

ఇదీ చూడండి: ప్రముఖ శాస్త్రవేత్త రోద్దం నరసింహ కన్నుమూత

Last Updated : Dec 15, 2020, 7:25 AM IST

ABOUT THE AUTHOR

...view details