Superstar Rajinikanth Punch Dialogue: రాజకీయాలకు దూరంగా ఉంటానని గతంలో రజనీకాంత్ స్పష్టం చేశారు. అంతేకాకుండా భవిష్యత్‌లోనూ రాజకీయాల్లోకి రాబోనని వివరించారు. తన ఆరోగ్యం సహకరించటం లేదని అందుకే రాజకీయ జీవితానికి దూరంగా ఉండనున్నట్లు వివరణ ఇచ్చారు. అందుకు తగినట్లుగా ఆయన రాజకీయాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు.
రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న తలైవా.. తాజాగా చెప్పిన డైలాగ్ మాత్రం తనను విమర్శించిన వారిని గట్టి ఎదురుదెబ్బ కొట్టినట్లుగా అనిపిస్తోంది. ఆయన చెప్పిన ప్రతి మాట విమర్శకులకు సూటిగా బాణాలు విసిరినట్లుగా అనిపిస్తున్నాయి. తనపై రాజకీయంగా విమర్శించిన వారికి.. ఈ డైలాగుల ద్వారా బదులిచ్చినట్లుగా ఉంది. ఆయన చెప్పిన డైలాగులు తాజాగా నెట్లింట్లో వైరల్ అవుతున్నాయి.
తలైవాను అలా చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్
Fans Reaction on Superstar Rajini Dialogue: సూపర్ స్టార్ రజనీ అభిమానులు ఆయన చెప్పిన డైలాగులను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. ఇప్పుడు తెలిసిందా రాజా.. ఎవరి కోసమో ఈ కామెంట్లు అని ఓ అభిమాని స్పందిస్తే.. మరో అభిమాని మాత్రం డైలాగులు ఎవరి కోసమైనా సూపర్‌గా చెప్పారంటూ ట్వీట్ చేశారు. చివర్లో డైలాగు తెలుగులో చెప్పారంటే తెలుగువాళ్ల కోసమేనని మరో అభిమాని సమాధానమిచ్చారు. రజనీకాంత్ సూపర్ మెసేజ్ ఇచ్చారంటూ మరొకరు ట్వీట్ చేశారు.