తెలంగాణ

telangana

ETV Bharat / bharat

29 పిల్లలకు జన్మనిచ్చిన 'సూపర్​ మామ్​' పులి మృతి

Super Mom Tigress: 29 పిల్లలకు జన్మనిచ్చిన 'సూపర్​మామ్'​ మరణించింది. 'సూపర్ ​మామ్'​ అంటే మనిషి కాదండోయ్​.. ఓ ఆడపులి. కేవలం ఎనిమిది ప్రసవాల్లోనే రికార్డ్ సృష్టించిన ఈ ఆడపులి వృద్ధాప్యంతో చనిపోయింది.

Collar wali
కాలర్​వ్యాలీ

By

Published : Jan 17, 2022, 2:35 PM IST

Super Mom Tigress: మధ్యప్రదేశ్​ పెంచ్​ టైగర్ రిజర్వ్​లో 29 పులిపిల్లలకు జన్మనిచ్చిన కాలర్ వాలీ అనే ఆడపులి మృతి చెందింది. పదిహేడేళ్ల వయస్సు కలిగిన ఈ పులి 'సూపర్​ మామ్'​గా పేరుగాంచింది.

కాలర్​వాలీ

"2008-2018 మధ్యకాలంలో 8 ప్రసవాల్లోనే 29 పులి పిల్లలకు జన్మనిచ్చి రికార్డ్ నెలకొల్పింది. మొదటిసారి మూడు పిల్లలకు జన్మనివ్వగా అవి బతకలేదు. చివరిసారిగా 2018లో నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. మొత్తంగా 29 పిల్లల్లో 25 బతకగలిగాయి. దీనిని 'టీ15' అని కూడా అంటారు."

- పెంచ్ టైగర్ రిజర్వ్​ అధికారులు

Collarwali Tigress Died: 2008లోనే 'కాలర్ వాలీ'కి రేడియా కాలర్​ వచ్చింది. ఆ తర్వాత అది పనిచేయకపోతే 2010లో మరోసారి ఇచ్చారు. అనంతరం 'కాలర్​ వాలీ'గా దేశవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి పొందింది. పన్నాటైగర్ రిజర్వ్​లో పులుల సంఖ్య తగ్గిన కారణంగా.. ఈ 'సూపర్​ మామ్​'ను టీనేజ్​లో ఒకసారి పెంచ్​ నుంచి పన్నాకు తరలించారని అధికారులు తెలిపారు. ముసలితనంతో బలహీనంగా ఉన్న ఈ పులిని చివరిసారిగా జనవరి 14న పర్యటకులు చూసినట్లు తెలుస్తోంది.

526 పులులతో 2018లోనే మధ్యప్రదేశ్​ పులుల రాష్ట్రంగా పేరొందింది.

ఇదీ చదవండి:దిగ్గజ కథక్​ కళాకారుడు పండిట్ బిర్జూ మహరాజ్ కన్నుమూత

ABOUT THE AUTHOR

...view details