తెలంగాణ

telangana

ETV Bharat / bharat

500 కి.మీల ఛేజింగ్.. 'సూపర్​ ఛోర్' బంటీ అరెస్ట్.. లగ్జరీ లైఫ్ చూసి షాక్​! - super chor bunty arrest by delhi police in kanpur

Super Chor Bunty : 'సూపర్ ఛోర్​'గా ఫేమస్​ అయిన బంటీ అలియాస్​ దేవేంద్ర సింగ్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 500 కిలోమీటర్ల మేర ఛేజింగ్​ చేసి అతడిని దిల్లీ పోలీసులు పట్టుకున్నారు. బంటీ ఇప్పటివరకు ఎన్ని దొంగతనాలు చేశాడంటే?

super thief bunty arrested by delhi police in up kanpur
యూపీ కాన్పుర్​లో సూపర్ ఛోర్​ బంటీని అరెస్ట్ చేసిన దిల్లీ పోలీసులు

By

Published : Apr 14, 2023, 3:46 PM IST

Super Chor Bunty : దేశంలో 'సూపర్​ ఛోర్​'(దొంగ)గా పేరు తెచ్చుకున్న బంటీ అలియాస్ దేవేంద్ర సింగ్​ అనే దొంగను దిల్లీ పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుడిని దాదాపు 500 కిలోమీటర్లు వెంబడించి.. సినీ ఫక్కీలో ఛేజింగ్​ చేసి ఉత్తర్​ప్రదేశ్​లోని కాన్పుర్​లో పట్టుకున్నారు. కాగా.. నిందితుడు బంటీ ఇటీవలే దక్షిణ దిల్లీలోని గ్రేటర్​ కైలాశ్​​ ప్రాంతంలోని పలు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు.

'సూపర్ ఛోర్​' బంటీ కహానీ..!
బంటీ(దేవేంద్ర) దిల్లీలోని వికాస్​పురికి చెందినవాడు. అతడు 9వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో బంటీ తండ్రి అతడిని కొట్టి మందలించాడు. తండ్రిపై కోపంతో ఇంటి నుంచి పారిపోయాడు బంటీ. ఆ తర్వాత ఇంటికి తిరిగి వెళ్లలేదు బంటీ. 1993లో మొదటి దొంగతనం చేశాడు బంటీ. అప్పుడు అతడి వయసు కేవలం 14 సంవత్సరాలు. దీంతో తొలిసారి దిల్లీ పోలీసులు బంటీని అరెస్ట్​ చేశారు. కొద్దిరోజులకే పోలీస్​ స్టేషన్​ నుంచి తప్పించుకుని పారిపోయాడు. పరారీలో ఉన్న అతడు.. దిల్లీ సహా హైదరాబాద్​, జలంధర్​, ఛండీగఢ్​, బెంగళూరు, కేరళ, చెన్నై తదితర ప్రాంతాల్లో వందల కొద్ది చోరీలకు పాల్పడ్డాడు.

ఇలా పలు రాష్ట్రాల్లో బంటీపై చోరీ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా 'సూపర్ ఛోర్​'గా ప్రసిద్ధి చెందాడు బంటీ. బాలీవుడ్‌లో 'సూపర్ ఛోర్​' బంటీపై 'ఓయ్​ లక్కీ! లక్కీ ఓయ్!' అనే సినిమా కూడా వచ్చిందంటే ఇతడు ఏ విధంగా ఫేమస్​ అయ్యాడో అర్థం చేసుకోవచ్చు. పైగా ఈ సినిమా సూపర్​హిట్​ అయ్యింది. ఇందులో బంటీ తన జీవితంలో ఏ విధంగా దొంగతనాలు, దోపిడీలు చేశాడో వివరంగా చూపించారు. విశేషమేంటంటే హిందీ సీజన్​ బిగ్​ బాస్​-4లో కంటెస్టెంట్​గా పాల్గొన్నాడు ఈ సూపర్​ ఛోర్​ బంటీ. ఇక నిందితుడు బంటీని అరెస్ట్​ చేసిన ప్రతిసారీ అతడి నుంచి పెద్ద మొత్తంలో నగదు, బంగారం, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకునేవారు పోలీసులు.

సింగిల్​గానే రాబరీ..!
ఛోర్​ బంటీ దగ్గరున్న స్పెషాలిటీ ఏంటంటే.. అతడు ఎప్పుడు దొంగతనాలకు వెళ్లినా ఒక్కడే వెళ్లేవాడు. తన ప్లాన్​ వేసుకుని అమలు చేసేవాడు ఈ గజదొంగ. అయితే అదికూడా కేవలం అర్ధరాత్రి 2 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య తన పనిని పూర్తి చేసేవాడు. కాగా, దొంగతనాల కేసుల్లో పట్టుబడ్డ అనంతరం బంటీకి బెయిలు దొరికేది. ఇలా ఓ సారి తన కుటుంబ సభ్యులను కలిసేందుకు ఇంటికి వెళ్లగా.. అతడిని రానివ్వలేదు. ఆ తర్వాత ఇంకెప్పుడూ తన ఇంటికి వెళ్లలేదు బంటీ. ఎప్పుడూ ఖరీదైన వాహనాలు, గడియారాలు, పెద్ద మొత్తంలో బంగారం, వజ్రాలు, లగ్జరీ కార్లను మాత్రమే దొంగిలించేవాడు. ఇలా చోరీలు చేసిన తర్వాత ఫైవ్ స్టార్ హోటళ్లు, రిసార్టుల్లో గడిపేవాడు బంటీ. దొంగిలించిన సొమ్ము పూర్తిగా ఖర్చు చేసిన తర్వాత మళ్లీ కొత్త దొంగతనానికి రెడీ అయ్యేవాడు.

ABOUT THE AUTHOR

...view details