తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహిళా కానిస్టేబుల్​పై ఇన్​స్పెక్టర్​ అత్యాచారం.. పాఠశాలలో బాలికలను.. - ఇద్దరు విద్యార్థినిల యూనిఫాం విప్పించిన ఉపాధ్యాయులు

మహిళా కానిస్టేబుల్​పై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ పోలీస్​ ఇన్​స్పెక్టర్​. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. మరోవైపు యూపీలోని హాపుడ్ జిల్లాలోని ఓ పాఠశాలలో ఇద్దరు బాలికల యూనిఫాంను విప్పించారు ఉపాధ్యాయులు.

rape in sultanpur woman constable
అత్యాచారం

By

Published : Jul 16, 2022, 1:13 PM IST

Updated : Jul 16, 2022, 1:47 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో దారుణం జరిగింది. నిషూ తోమర్ అనే పోలీసు ఇన్​స్పెక్టర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళా కానిస్టేబుల్ కొత్వాలి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఆమె సుల్తాన్​పుర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు కార్యాలయంలో విధులు నిర్వహిస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు.. ఇవి తప్పుడు ఆరోపణలని ఇన్​స్పెక్టర్​ చెబుతున్నారు.

"మహిళా కానిస్టేబుల్‌పై నాపై చేసినవన్నీ అసత్య ఆరోపణలు. మహిళా కానిస్టేబుల్ తన తల్లి ఆరోగ్యం బాగోలేదని నా దగ్గర కొంత డబ్బు తీసుకుంది. ఆ డబ్బులు ఇవ్వమని అడిగేసరికి ఇలా నాపై నకిలీ కేసు పెట్టింది. ఆమె ఫిర్యాదుకు బదులుగా నేను సుల్తాన్‌పుర్ పోలీసులకు ఫిర్యాదు చేశా. మూడు నెలల క్రితమే కోర్టును ఆశ్రయించాను. ఈ కేసు ఆగష్టులో విచారణకు రానుంది."

-నిందితుడు

బాలికలకు యూనిఫాం విప్పించి:ఇద్దరు బాలికల యూనిఫాంను బలవంతంగా విప్పించారు ఇద్దరు ఉపాధ్యాయులు. ఉత్తర్​ప్రదేశ్​ హాపుడ్​​ జిల్లా ధలానా ప్రాథమిక పాఠశాలలో ఈ అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఓ బాలిక వయసు తొమ్మిదేళ్లు కాగా, మరో బాలిక వయసు ఎనిమిది సంవత్సరాలు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశామని జిల్లా విద్యాశాఖ అధికారి అర్చన గుప్తా తెలిపారు.

నా కుమార్తె, నా అన్న కుమార్తె ధలానా ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. వీరిద్దర్ని యూనిఫాం తీయమని ఇద్దరు ఉపాధ్యాయులు బలవంతపెట్టారు. దానికి వీరు ససేమిరా అనడం వల్ల బాలికలిద్దరిని తీవ్రంగా కొట్టారు. పాఠశాల నుంచి పంపేస్తామని బెదిరించారు. భయపడిన అమ్మాయిలు బట్టలు విప్పి తోటి విద్యార్థులకు ఇచ్చారు. నగ్నంగా ఉన్న బాలికల ఫొటోలను ఉపాధ్యాయులు తీశారు. ఈ విషయం ఇంట్లో చెప్పొద్దని హెచ్చరించారు.

-బాధితురాలి తండ్రి

ఇవీ చదవండి:మోదీపై అహ్మద్​ పటేల్​ కుట్ర.. తీస్తా అందులో భాగమే: సిట్​

కొచ్చిలో ఫ్లైట్​ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 45 నిమిషాల వ్యవధిలో!

Last Updated : Jul 16, 2022, 1:47 PM IST

ABOUT THE AUTHOR

...view details