తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నక్సల్స్​ కాల్పుల్లో 'కోబ్రా' కమాండో మృతి - ఛత్తీస్​గఢ్​ వార్తలు

Sukma Encounter: మావోయిస్టులు , భద్రతా దళాల మధ్య కాల్పుల్లో కోబ్రా కమాండో​ వీరేంద్ర సింగ్​ మృతిచెందారు. ఇదిలా ఉంటే రాజనంద్​గావ్​లో ఓ స్థానికుడిని నక్సల్స్​ హతమార్చారు.

sukma encounter
నక్సల్స్​ కాల్పులు సుక్మా

By

Published : Jan 1, 2022, 6:35 AM IST

Sukma Encounter: ఛత్తీస్​గఢ్​లోని నక్సల్స్​ ప్రభావిత ప్రాంతమైన సుక్మాలో మరోసారి కాల్పుల మోత మోగింది. శుక్రవారం.. భద్రతా దళాలకు నక్సల్స్​కు మధ్య జరిగిన కాల్పుల్లో వీరేంద్ర సంగ్​ అనే జవాను ప్రాణాలు కోల్పోయారు. వీరేంద్ర సింగ్​.. 'కోబ్రా' 208 బెటాలియన్​కు కమాండోగా సేవలు అందిస్తున్నారు.

నక్సల్స్​ ఉన్నారన్న సమాచారంతో ఆ ప్రాంతానికి చేరుకున్న దళాలపై మావోయిస్టులు కాల్పులకు దిగారు. ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో గాయపడిన వీరేంద్ర సింగ్​.. మృతిచెందారు.

అనుమానం వచ్చి..

రాజనంద్​గావ్​లోని నిదేలీలో తిజురామ్​ అనే గ్రామస్థుడిని నక్సల్స్​ హతమార్చారు. అతను పోలీస్​ ఇన్​ఫార్మర్​ అని వారు అనుమానించడమే అందుకు కారణం. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 4 గంటలకు ఐదుగురు నక్సలైట్లు తిజురామ్​ ఇంటికి వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు.

ఇదీ చూడండి :' ప్రేమ పెళ్లిళ్లు అమ్మాయిలకు ప్రమాదకరం'

ABOUT THE AUTHOR

...view details