తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హైవేపై దిగిన మూడు యుద్ధవిమానాలు- ఎందుకంటే? - రహదారిపై దిగిన యుద్ధవిమానాలు

భారత వాయుసేనకు చెందిన మూడు యుద్ధవిమానాలు రహదారిపై (Purvanchal Expressway route) దిగాయి. సుఖోయ్-30, మిరాజ్ 2000, ఏఎన్32 టర్బోప్రాప్​తో పాటు మరో రవాణా విమానం సైతం రహదారిపై ల్యాండ్ అయింది.

purvanchal expressway sukhoi mirage land
purvanchal expressway sukhoi mirage land

By

Published : Nov 15, 2021, 1:23 PM IST

Updated : Nov 15, 2021, 1:28 PM IST

హైవేపై దిగిన మూడు యుద్ధవిమానాలు

ఉత్తర్​ప్రదేశ్​ సుల్తాన్​పుర్ ప్రాంతంలో నిర్మించిన పూర్వాంచల్ ఎక్స్​ప్రెస్ ​వేపై (Purvanchal Expressway route) మూడు యుద్ధవిమానాలు దిగాయి. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రహదారిని ప్రారంభించనున్న (Purvanchal Expressway inauguration date) నేపథ్యంలో.. ముందస్తు ట్రయల్స్​లో భాగంగా ఎక్స్​ప్రెస్​వేపై ల్యాండ్ అయ్యాయి. మిరాజ్ 2000, సుఖోయ్-30, ఏఎన్32 టర్బోప్రాప్ యుద్ధవిమానాలతో పాటు సీ-130 రవాణా విమానం సైతం రహదారిపై ఆదివారం దిగినట్లు తెలుస్తోంది.

రహదారిపై దిగుతున్న విమానం

లఖ్​నవూను యూపీలోని తూర్పున ఉండే ప్రాంతాలను కలుపుతూ 340.8 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించారు. ఆరు లేన్ల ఈ ఎక్స్​ప్రెస్ వే(Purvanchal Expressway route).. బారాబంకి, అమేఠీ, సుల్తాన్​పుర్, అయోధ్య, అంబేడ్కర్ నగర్, ఆజంగఢ్, మౌ, గాజీపుర్ జిల్లాలను (Purvanchal Expressway route map 2021) కలుపుతుంది. రహదారిలో భాగంగా సుల్తాన్​పుర్ వద్ద 3.2 కిలోమీటర్ల ఎయిర్​స్ట్రిప్ సిద్ధం చేశారు. అత్యవసర సమయంలో యుద్ధ విమానాలు దిగేందుకు వీలుగా దీన్ని ఏర్పాటు చేశారు.

రహదారిపై ల్యాండ్ అయిన సీ130

వాహనదారులకు ప్రయోజనం కలిగేలా, ఇంధన వాడకం తగ్గేలా ఈ రహదారిని నిర్మించారు. భవిష్యత్​లో దీన్ని ఎనిమిది వరుసల రహదారిగా మార్చుకోవచ్చు. రూ.22,500 కోట్ల వ్యయంతో రహదారిని పూర్తి చేశారు.

ఇదీ చదవండి:విశాఖ నుంచి మహారాష్ట్రకు గంజాయి- 1500 కిలోలు సీజ్​​

Last Updated : Nov 15, 2021, 1:28 PM IST

ABOUT THE AUTHOR

...view details