పంజాబ్ నూతన సీఎంగా(Punjab New CM) సుఖ్జిందర్ సింగ్ రంధావా(Sukhjinder Singh Randhawa) పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసిందని తొలుత వార్తలొచ్చాయి. పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించి అందరి ఆ ఆమోదంతో ఈ ఏఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే అనూహ్యంగా యువనేత చరణ్‌జీత్ సింగ్ సన్నీకి కాంగ్రెస్ అధిష్ఠానం సీఎంగా అవకాశం ఇచ్చింది. ఆ పార్టీ సీనియర్ నేత హరీశ్ సింగ్ రావత్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
అయితే పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు సుఖ్జిందర్ తెలిపారు. చరణ్‌జీత్ సింగ్ తనకు సోదరుడి లాంటి వాడని పేర్కొన్నారు.
ఇద్దరు డిప్యూటీ సీఎంలు
నూతన సీఎంతో పాటు ఈసారి ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. ఒక హిందు ఎమ్మెల్యే, మరొక దళిత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు ఆ అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పదవికి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు అరుణా చౌధరి పేరు పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్.. శనివారం రాజీనామా చేశారు. పార్టీలో అవమానం భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
పంజాాబ్ మాజీ మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ, కెప్టెన్ అమరీందర్ సింగ్ మధ్య గతకొంత కాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ వివాదం ముదిరే పార్టీలో సంక్షోభం(Punjab Congress Crisis) తలెత్తింది. ఈ నేపథ్యంలో అమరీందర్ రాజీనామా చేశారు.