Sukesh Chandrashekhar case: మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. ఈ కేసులో ప్రధాన నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ నుంచి ఖరీదైన కానుకలు తీసుకున్నారని తెలిసింది. అయితే, ఎలాంటి కానుకలు అందుకున్నారనే విషయంపై క్లారిటీ లేదు. ఈడీ ఛార్జిషీట్ ప్రకారం.. ఫెర్నాండేజ్ అందుకున్న కానుకలు కొన్ని బయటకు వచ్చాయి.
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఫెర్నాండెజ్ ఈ ఏడాది ఆగస్టు 30, అక్టోబర్ 20న ఈడీ ముందు హాజరయ్యారు. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసింది దర్యాప్తు సంస్థ. ఆమె చెప్పిన వివరాలను ఛార్జిషీట్లో పేర్కొంది.
ఛార్జిషీట్ ప్రకారం.. గూచీ, ఛానల్ కంపెనీలకు చెందిన మూడు డిజైనర్ బ్యాగులు, గుచీ సంస్థకు చెందిన 2 జిమ్ షూట్లు ఉన్నాయి. అలాగే.. ఒక జత లూయిస్ విట్టన్ షూ, రెండు జతల డైమండ్ చెవిపోగులు, మల్టీకలర్ రాళ్ల బ్రాస్లెట్, రెండు హీర్మేస్ బ్రాస్లెట్లు, ఒక మినీ కూపర్‌ను కానుకలుగా అందుకున్నారు ఫెర్నాండెజ్. మరోవైపు.. పలు సందర్భాల్లో చంద్రశేఖర్ ప్రైవేట్ జెట్ ట్రిప్పులు సైతం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఖరీదైన గుర్రం, పిల్లులపై వార్తలు..
సుకేశ్ జైలులో ఉన్నప్పటికీ 2021 జనవరి నుంచి ఫోన్ ద్వారా జాక్వెలిన్‌తో మాట్లాడుతున్నట్లు ఛార్జిషీట్లో పేర్కొంది ఈడీ. అతని నుంచి సుమారు రూ.10 కోట్లు విలువైన కానుకలు తీసుకున్నారన్న ఆరోపణలపై పలుమార్లు ప్రశ్నించింది. వాటిపై సరైన స్పందన రాలేదని పేర్కొంది. మరోవైపు.. చంద్రశేఖర్ పంపిన కానుకల్లో రూ.52 లక్షల విలువైన గుర్రం, నాలుగు పర్షియన్ పిల్లులు(ఒక్కోటి రూ.9 లక్షలు), ఖరీదైన చాక్లెట్లు, పూలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
కేసు ఏమిటి?