తెలంగాణ

telangana

Sukesh Chandrashekar Case: 'జైలు సిబ్బందికి ప్రతి నెలా రూ.కోటి లంచం'

By

Published : Dec 18, 2021, 4:23 PM IST

Sukesh Chandrashekar Case: తిహాడ్‌ జైలులో తనకు ఖరీదైన వసతులు కల్పించడానికి జైలు సిబ్బందికి సుఖేశ్‌ ప్రతి నెలా రూ.కోటి లంచం ఇచ్చినట్లు తాజాగా ఈడీ వెల్లడైంది. జైలుకు వెళ్లినప్పటికీ అతడు తన తీరు మార్చుకోలేదు సరికదా.. అక్కడి నుంచే నేరాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.

Sukesh Chandrashekar News
సుఖేశ్‌ చంద్రశేఖర్‌ కేసు

Sukesh Chandrashekar Case: ఆర్థిక మోసగాడు సుఖేశ్‌ చంద్రశేఖర్‌ కేసులో తవ్వే కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రూ.200కోట్ల మోసం కేసులో అరెస్టయిన సుఖేశ్‌.. ప్రస్తుతం దిల్లీలోని తిహాడ్‌ జైలులో ఉన్నాడు. అయితే అక్కడ తనకు ఖరీదైన వసతులు కల్పించడంతో పాటు స్వేచ్ఛగా ఉండేందుకు వీలుగా జైలు సిబ్బందికి సుఖేశ్‌.. ప్రతి నెలా రూ.కోటి లంచం ఇస్తున్నాడని తాజాగా ఈడీ దర్యాప్తులో వెల్లడైనట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

Sukesh Chandrasekhar who is he:

రాన్​బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్​, శివిందర్​ సింగ్​కు బెయిల్​ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర నుంచి ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేసిన కేసులో సుఖేశ్‌ను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే జైలుకు వెళ్లినప్పటికీ అతడు తన తీరు మార్చుకోలేదు సరికదా.. అక్కడి నుంచే నేరాలకు పాల్పడినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకోసం జైలు సిబ్బందికి పెద్ద ఎత్తున లంచాలు ఇచ్చినట్లు సమాచారం. జైల్లో మొబైల్‌ ఫోన్‌ వినియోగించేందుకు 15 రోజులకు రూ.60-75లక్షలు ఇచ్చినట్లు సదరు కథనాలు తెలిపాయి. జైలు గదిలో లగ్జరీ సదుపాయాలతో పాటు స్వేచ్ఛగా ఉండేందుకు ప్రతి నెలా రూ.కోటి వరకు ఇచ్చినట్లు తెలిసింది.

Sukesh Chandrasekhar Jacqueline:

జైల్లో ఉన్న సుఖేశ్‌ను జాక్వెలిన్‌ ఫెర్నాండెస్‌, నోరా ఫతేహీతో పాటు చాలా మంది బాలీవుడ్‌ హీరోయిన్లు, మోడల్స్‌ వచ్చేవారని సదరు కథనాలు పేర్కొన్నాయి. మొత్తం 12 మంది హీరోయిన్లు, మోడల్స్ జైల్లో అతడిని కలిసినట్లు సమాచారం. అంతేగాక, జైల్లో సిబ్బందికి సుఖేశ్‌.. చికెన్‌ పార్టీలు కూడా ఇచ్చేవాడని ఆ కథనాలు తెలిపాయి.

ఇదిలా ఉంటే.. తిహాడ్​ జైలు సిబ్బంది తనను వేధింపులకు గురిచేస్తున్నారని సుఖేశ్‌ అధికారులకు లేఖ రాశాడు. తనను డబుల్‌ లాక్ గదిలో బంధించడంతో మానసికంగా కుంగిపోతున్నానని పేర్కొన్నాడు. అంతేగాక, తన భార్యను కేవలం రెండు వారాలకొకసారి మాత్రమే కలవనిస్తున్నారని ఆరోపించాడు.

Sukesh Chandrasekhar Nora Fatehi:

దోపిడీ కేసులో భాగంగా నటి, డ్యాన్సర్ నోరా ఫతేహి, జాక్వెలిన్​ ఫెర్నాండేజ్​ను కూడా ఈడీ ప్రశ్నించింది. సుకేశ్​ జైలులో ఉన్నప్పటికీ 2021 జనవరి నుంచి ఫోన్​ ద్వారా జాక్వెలిన్​తో మాట్లాడుతున్నట్లు ఛార్జిషీట్​లో పేర్కొంది ఈడీ. అతని నుంచి ఖరీదైన కానుకలు పొందినట్లు తెలిపింది. రూ.10కోట్లు విలువైన కానుకలు తీసుకున్న ఆరోపణలపై జాక్వెలిన్‌ను పలు మార్లు ప్రశ్నించగా.. ఎటువంటి స్పందన రాకపోవడం వల్ల ఆమెపై లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేసింది ఈడీ.

చంద్రశేఖర్​ పంపిన కానుకల్లో రూ.52 లక్షల విలువైన గుర్రం, నాలుగు పర్షియన్​ పిల్లులు(ఒక్కోటి రూ.9 లక్షలు), ఖరీదైన చాక్లెట్లు, పూలు ఉన్నట్లు సమాచారం. నటి కుటుంబ సభ్యులకు సైతం నగదు పంపించినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చదవండి:

సుకేశ్​ నుంచి ఫెర్నాండెజ్​ అందుకున్న కానుకలు ఇవే!

అతడి నుంచి గిఫ్ట్​గా ఖరీదైన పిల్లులు.. అందుకే ఆ నటికి ఇన్ని కష్టాలు!

బిజినెస్​మెన్​ భార్యలకు వల.. రూ.200 కోట్లకు టోకరా!

ABOUT THE AUTHOR

...view details