తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రేయసిని హత్య చేసి సూట్​ కేసులో కుక్కి.. కొత్త డ్రామా! - ఆత్మహత్య నాటకం

Suitcase Murder Case: పెద్దల మాటకు కట్టుబడి తనతో పెళ్లికి ఒప్పుకోలేదనే కారణంగా తన ప్రేయసిని హత్య చేశాడో యువకుడు. సూట్​కేసులో కుక్కి నదిలో పడేసేందుకు యత్నించగా దొరికిపోయాడు. తప్పించుకునేందుకు ఆత్మహత్య నాటకం ఆడాడు. ఈ సంఘటన ఉత్తరాఖండ్​ రూడ్కీ జిల్లాలో గురువారం రాత్రి జరిగింది. పోలీసుల విచారణలో తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.

lover murdered by boy friend
ప్రేయసి హత్య

By

Published : Mar 25, 2022, 8:36 PM IST

Suitcase Murder Case: పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ప్రియురాలిని హోటల్​కు తీసుకెళ్లి హత్య చేశాడు ఓ యువకుడు. సూట్​కేసులో కుక్కి నదిలో పడేసేందుకు యత్నించగా హోటల్​ సిబ్బంది పట్టుకున్నారు. వారికి ఆత్మహత్య అంటూ కట్టుకథ చెప్పాడు. అనుమానం వచ్చిన పోలీసులు తమదైశ శైలిలో విచారించగా.. పథకం ప్రకారమే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ సంఘటన ఉత్తరాఖండ్​ రూడ్కీ జిల్లా పిరాన్​ కలియార్​ ప్రాంతంలో గురువారం రాత్రి జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం: మంగళూరుకు చెందిన రమ్​శా అనే యువతిని.. ఆమె దూరపు చుట్టం, గుల్​జేబ్​కు చెందిన యువకుడు సనవార్​ ప్రేమించాడు. ఇరువురు కలిసి గురువారం రాత్రి పిరాన్​ కలియార్​ ప్రాంతంలోని ఓ హోటల్​కు వచ్చారు. కొద్ది గంటల తర్వాత పెద్ద సూట్​కేసుతో హోటల్​ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అతని కదలికలపై అనుమానం వచ్చిన సిబ్బంది, స్థానికులు యువకుడిని పట్టుకున్నారు. సూట్​కేసు తెరిచి చూడగా యువతి మృతదేహం లభ్యమైంది. ఈ క్రమంలో తాము ఆత్మహత్య చేసుకునేందుకే హోటల్​కు వచ్చామని, ముందుగా తన ప్రేయసి విషం తాగి చనిపోయిందని చెప్పాడు. తన మృతదేహాన్ని నదిలో పడేసి ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రణాళిక చేసుకున్నామని చెప్పాడు. అనుమానపడిన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రియుడిని అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని పోస్ట్​మార్టానికి తరలించారు.

పక్కా ప్రణాళికతోనే:యువకుడి పొంతనలేని సమాధానాలతో తమదైన శైలిలో విచారించారు పోలీసులు. దీంతో తానే హత్య చేశానని, ఆత్మహత్య ఓ నాటకమని ఒప్పుకున్నాడు. తమ పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని, వారి మాటకే కట్టుబడి ఉంటానని తనను దూరం పెట్టిందని చెప్పాడు. దీంతో కోపం పెంచుకున్న సనవార్​.. హత్యకు పక్కా ప్రణాళిక రచించాడు. ముందుగానే ఓ సూట్​కేసును కొనుగోలు చేశాడు. యువతి పేరు రమ్​శా కాకుండా కాజల్​ పేరుతో గుర్తింపుకార్డు చూపించి హోటల్​లో గది తీసుకున్నాడు. రాత్రి హోటల్​కు తీసుకెళ్లి హత్య చేసి.. సూట్​ కేసులో కుక్కి పడేసేందుకు ప్రయత్నించి దొరికిపోయాడు. హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు రూడ్కీ జిల్లా ఎస్పీ ప్రమేంద్ర డోభాల్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details