తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో రోజుకు 418 మంది బలవన్మరణం - ఆత్మహత్యలపై ఎన్​సీఆర్​బీ డేటా

దేశంలో ఆత్మహత్యలకు సంబంధించి విస్తుపోయే గణాంకాలను వెల్లడించింది కేంద్రం. 2020లో లక్షా 50వేలకు పైగా బలవన్మరణాలు నమోదైనట్లు జాతీయ నేర నమోదు విభాగం తెలిపింది.

NCRB
ఎన్​సీఆర్​బీ

By

Published : Oct 29, 2021, 4:01 PM IST

భారత్​లో ఆత్మహత్య చేసుకునే వారి సంఖ్య 2020లో(ncrb report 2020) భారీగా పెరిగింది. మొత్తం 1,53,052 మంది ప్రాణాలు తీసుకున్నట్లు జాతీయ నేర నమోదు విభాగం నివేదించింది. 2019లో నమోదైన 1,39,123 ఆత్మహత్యలతో పోల్చితే ఇది అధికం. 2020లో రోజుకు సగటున 418 మంది ప్రాణాలు విడిచారు.

లక్ష మందికి గాను ఆత్మహత్యల రేటు(suicide rate in india ncrb) 2019లో 10.4 ఉండగా.. గతేడాది 11.3కి పెరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తన వార్షిక నివేదికలో పేర్కొంది. ప్రధానంగా ఐదు రాష్ట్రాల్లో(ncrb report 2020 state wise) 50.1 శాతం ఆత్మహత్యలు నమోదైనట్లు తెలుస్తోంది. దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ఉత్తర్​ప్రదేశ్​లో 3.1 శాతం ఆత్మహత్యలు నమోదయ్యాయి. దాదాపు 20 వేల ఆత్మహత్యలతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది.

రాష్ట్రాల వారీగా..

  • మహారాష్ట్రలో అత్యధికంగా 13శాతం అంటే 19,909 మంది ఆత్మహత్య చేసుకున్నారు.
  • తమిళనాడులో 16,883(11 శాతం).
  • మధ్యప్రదేశ్‌లో 14,578(9.5 శాతం).
  • బంగాల్‌లో 13,103(8.6 శాతం).
  • కర్ణాటకలో 12,259(8 శాతం) ఆత్మహత్యలు నమోదయ్యాయి.
  • కేంద్రపాలిత ప్రాంతాల్లో నమోదైన ఆత్మహత్యల్లో దిల్లీ అత్యధిక మరణాలను(3,142) నమోదుచేసింది. 408 మరణాలతో పుదుచ్చేరి తరువాతి స్థానంలో ఉంది.

2020లో 70.9శాతం మంది పురుషులు ఆత్మహత్యలు చేసుకోగా.. మహిళలు 29.1శాతం మంది ప్రాణాలు విడిచారు.

ఆత్మహత్యలకు కారణాలు..

  • కుటుంబ సమస్యలు(33.6 శాతం)
  • అనారోగ్యం(18 శాతం)
  • వివాహ సంబంధిత సమస్యలు(5 శాతం)

'సహజ మరణాలు కాదు..'

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఏడాదికి 70వేల మందికి పైగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరెంతో మంది ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇవి సహజ మరణాలు కావని.. నివారించదగినవేనని, సామాజిక, వ్యక్తిగత స్థాయిలో గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని డబ్ల్యూహెచ్​ఓ సూచించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details