తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వేప చెట్టు నుంచి పాలు.. ఆమె మహిమేనట.. తాగితే రోగాలు మాయం అంటూ... - వేప చెట్టుకు పూజలు

మధ్యప్రదేశ్​లో ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. ఓ వేప చేట్టు నుంచి పాలు కారుతున్నాయి. ఇలా జరగడం షీత్లా మాత మహిమేనని అంటున్నారు భక్తులు. ఈ పాలను ప్రసాదంగా భావిస్తున్నారు. అసలు ఈ కథేంటో ఓ సారి తెలుసుకుందాం.

neem tree giving milk in singrauli
వేప చెట్టు నుంచి కారుతున్న పాలు

By

Published : Oct 16, 2022, 1:50 PM IST

వేప చెట్టు నుంచి కారుతున్న పాలు

మధ్యప్రదేశ్​ సింగరౌలీలోని నిగాహిలో ఓ వేపచేట్టు నుంచి పాల రూపంలో ద్రవం కారుతోంది. ఈ ఘటన శనివారం ఉదయం జరిగింది. ఇలా పాలు కారడం షీత్లా మాత మహిమే అని అంటున్నారు భక్తులు. ఈ పాలను అమ్మవారి ప్రసాదంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో వందలాది మంది భక్తులు వేపచెట్టు దగ్గర గుమిగూడారు. చాలా మంది భక్తులు చెట్టు నుంచి కారే పాలను పాత్రలో నింపి ఇంటికి తీసుకెళ్తున్నారు. ఈ పాలను తాగితే అనేక రోగాలు నయమవుతాయని అంటున్నారు.

వేప చెట్టు నుంచి కారుతున్న పాలు

వేపచెట్టు నుంచి పాలు కారుతున్నాయని తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామ ప్రజలు, భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇలా చెట్టు నుంచి పాలు కారడం అద్బుతమని అంటున్నారు గ్రామస్థులు. ఈ వేప చెట్టును చాలా సంవత్సరాలుగా పూజిస్తున్నామని చెబుతున్నారు. ఈ పాలు తాగడం వల్ల అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని అంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు కాలినడకన వచ్చి ఈ చెట్టు కింద కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తున్నారు. గతంలో కూడా ఈ చెట్టు కింద ఎన్నో అద్భుతాలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు.

పూజలు చేస్తున్న భక్తులు

ABOUT THE AUTHOR

...view details