దేశంలో రెండోదశ కరోనా మహమ్మారి మహోగ్రరూపం దాల్చుతున్న వేళ.. వైరస్ బారినపడకుండా పలు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో మాస్క్ ధరించడంపై తనదైన శైలిలో అవగాహన కల్పిస్తున్నారు ప్రముఖ సైకత శిల్పి పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్.
సైకత శిల్పంతో 'మాస్క్'పై అవగాహన - సైకత శిల్పంతో మాస్క్‌పై అవగాహన
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. మాస్క్‌కు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మాస్క్ ధరించడంపైనే జీవితం ఆధారపడి ఉందంటూ సైకత శిల్పంతో చక్కటి సందేశమిచ్చారు ప్రముఖ సైకత కళాకారుడు సుదర్శన్ పట్నాయక్.

మాస్క్ సందేశాన్నిచ్చే సైకత శిల్పం
సైకత శిల్పంతో మాస్క్‌పై అవగాహన
పూరీ- గోల్డెన్ బీచ్‌లో మాస్క్ ధరించడంపై అవగాహన కల్పిస్తూ.. అద్భుత రీతిలో సైకత శిల్పాన్ని రూపొందించారు సుదర్శన్. 'సక్రమంగా మాస్క్ ధరించడంపైనే మన జీవితం ఆధారపడి ఉంటుంద'ని సందేశమిచ్చారు.
ఇదీ చదవండి:కరోనా పరిస్థితిపై ప్రధాని మోదీ కీలక భేటీ