తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Success Secrets By Lord Shiva in Telugu: జీవితంలో విజయానికి.. మహా శివుడు చెప్పిన రహస్యాలివే..! - సక్సెస్​ గురించి శివుడు చెప్పిన రహస్యాలు

Success Secrets By Lord Shiva in Telugu: "గెలుపు.." జీవితంలో గెలుపోటములు సహజం. గెలిచినప్పుడు పొంగిపోయి.. ఓడినప్పుడు కుంగిపోకుండా దానిన అధిగమించి లైఫ్​లో సక్సెస్​ అవ్వాలి. పురాణాల ప్రకారం.. జీవితంలో సక్సెస్​ అయ్యేందుకు అవసరమయిన రహస్యాలను తన సతీమణి పార్వతికి ఆ శివుడు వెల్లడించారట. మరి ఆ రహస్యాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

Lord Shiva Success Secrets in Telugu
Success Secrets By Lord Shiva in Telugu

By ETV Bharat Telugu Team

Published : Sep 18, 2023, 4:51 PM IST

Success Secrets By Lord Shiva in Telugu:ఈ భూమ్మీద ప్రతి మనిషీ.. ఏదో ఓ సమయంలో పరాజయాన్ని చవి చూస్తాడు. చేసే పనిలో కావొచ్చు.. రాసే పరీక్షలో కావొచ్చు.. ఆర్థికం అవ్వొచ్చు.. ఆరోగ్యం కావొచ్చు.. ప్రేమలో కావొచ్చు.. కుటుంబంలో జరగొచ్చు.. ఓటమి సందర్భం అనివార్యం! అయితే.. ఆ పరిస్థితిని అధిగమించి జీవితంలో ఎలా ముందుకు కదిలావు అన్నదే కీలకం. ఇది కేవలం మన చేతుల్లోనే ఉంటుంది అని స్వయంగా చెప్పాడట.. ఆ పరమశివుడు. ఓ సందర్భంలో పార్వతీదేవికి.. పరమేశ్వరుడు ఇలా హితబోధ చేశాడట....

సంకల్పం..
Be Determined to Achieve Your Goal: నువ్వు చేయాలనుకుంటున్న పనిలో.. మనస్ఫూర్తిగా నీ సంకల్పం ఎంత? అన్నదాన్ని బట్టే.. నీ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. గెలుపు నీ తలుపు తట్టాలంటే.. దృఢమైన నిబద్ధత కలిగి ఉండాలి. అనుకున్నది సాధించడానికి సంకల్పం తప్ప మరేది అవసరం లేదు.

ఎవరు ఏమనుకుంటున్నారో..
Don’t Let the Society and People Affect You: సమాజం నీ గురించి తనదైన విశ్లేషణ చేస్తుంది. నీవు మంచి వ్యక్తి అని కొందరు చెప్పవచ్చు. అది నమ్మితే నీలో అహం పెరుగుతుంది. నీవు చెడ్డ మనిషివి అని మరికొందరు తీర్పు ఇవ్వొచ్చు. అంది అంగీకరిస్తే.. నీపై నీకే నమ్మకం పోతుంది. ఇవి రెండూ.. నీ పతనానికి దారితీస్తాయి. అందుకే.. నీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో పట్టించుకోకు. మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తినా.. వినయంగా ఉండాలే తప్ప, వాటిని అతిగా విశ్వసించకూడదు.. అప్పుడే మీ లక్ష్యాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టగలరు.

గురువుల పట్ల గౌరవం..
Always Respect your Teachers: మీకు గురువులతో ఉన్న అనుభవం మంచిది అయినా.. చెడ్డది అయినా.. వారిపై ఎప్పుడూ గౌరవం కలిగి ఉండాలి. వారు మీకు నేర్పిన పాఠాలు పరీక్షల్లో ఉపయోగపడకపోయినా.. జీవితంలో మాత్రం తప్పక ఉపయోగపడతాయి.

స్థిరంగా ఉండండి..
Keep a Balanced Mind: ఆధిపత్యం, ఓటమి వంటి వాటిని చూసి బాధపడకూడదు. ఆత్మ నూన్యతాభావం మిమ్మల్ని అణగదొక్కుతుంది. మీ మనస్సును మించిన శక్తి.. ఈ ప్రపంచంలో మరొకటి లేదనే విషయాన్ని మొదట మీరు నమ్మండి. ఏ ప్రత్యామ్నాయ ఆలోచన లేకుండా.. మీ చేయాలనుకున్న చర్యను అమలు చేయండి. ఇతరుల అభిప్రాయాలను మీ మనసుపైకి అనుమతించకండి. అతిగా ఆలోచించవద్దు. ఆందోళన చెందవద్దు. స్థిరంగా ఉండండి.

ఆత్మవిశ్వాసం వదలకండి..
Have Self Control:ఇతరులు ఏదో అన్నారని.. తమను తాము తక్కువగా ఊహించుకునే వారు బలహీనులుగా మారిపోతుంటారు. అలాంటి సమయంలో తమలో ఉన్న శక్తి కూడా నీరుగారిపోతుంది. తెలిసిన పనిలోనూ పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి.. ఎలాంటి పరిస్థితిలోనూ ఆత్మవిశ్వాసాన్ని వదలకండి. ఇది వెంట ఉన్నవారు మాత్రమే విజయం సాధిస్తారు.

భయం వదలండి...

జీవితంలో గెలుపు, ఓటములు అనేవి.. పగలు, రాత్రి వంటివి. ఒకటి లేకుండా మరొకటి ఉండదు. ఇది అత్యంత సహజం అన్న విషయం గుర్తించండి. ఇది అర్థమైతే.. ఓటమి భయం వదిలిపోతుంది. అప్పుడు చేసే ప్రతి పనీ నిర్భయంగా మొదలు పెడతారు.

సరైన ఆహారం..
Eat well: మనం తీసుకునే ఆహారం సరైనదా కాదా అనేది ముందుగా తెలుసుకోవాలి. ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. అనారోగ్యకరమైన ఆహారాన్ని ఎప్పుడూ తీసుకోకూడదు. మీ జీవిత లక్ష్యాన్ని సాధించాలంటే.. శరీరం ఆరోగ్యంగా ఉండాలి. ఆ శక్తిని పొందాలంటే.. పోషకమైన ఆహారాన్ని తీసుకోవాలి.

పరమేశ్వరుడు చెప్పిన ఈ జీవిత సూత్రాలను పాటిస్తే.. ప్రతి ఒక్కరూ జీవితంలో సులభంగా గెలవగలరు. మధ్యలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. వాటిని అధిగమించి.. అనుకున్న లక్ష్యానికి తప్పక చేరుకోగలరు. మీరేమంటారు..?

Lord Shiva : శివుడు శ్మశానంలో ఎందుకు ఉంటాడు..?

మనకు తెలిసిన శివరూపం లింగం ఒకటే.. కానీ తెలియని రూపాలు ఎన్నో

ABOUT THE AUTHOR

...view details