తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అంబులెన్స్​కు డబ్బులేక భర్త మృతి.. అలా ఎవరికీ కాకూడదని ఆమె ఏం చేసిందంటే? - గుజరాత్ మహిళ సంగీతాబెన్ షా అంబులెన్స్ సేవలు న్యూస్

చనిపోయిన తన భర్త జ్ఞాపకార్థంగా తక్కువ ధరకే అంబులెన్స్​ సేవలను అందిస్తోంది ఓ మహిళ. ఇలా ఆపదలో ఉన్నవారికి తన వంతు సాయం చేస్తూ అనేక మంది మనసుల్లో చోటు సంపాదించుకుంది. మరి ఆమె విశేషాలేంటో తెలుసుకుందాం రండి..

Subsidized ambulance sevice for the needy: Gujarat woman's unique tribute to her late husband
సబ్సీడీ ధరలో అంబులెన్స్ సేవలు అందిస్తున్న సంగీతాబెన్ షా

By

Published : Dec 30, 2022, 12:27 PM IST

ప్రియమైన వారు చనిపోతే వారి జ్ఞాపకార్థంగా పేద ప్రజలకు భోజనాలు పెట్టడం, బహుమతులను ఇవ్వటం లాంటి సంఘటనలు చాలానే చూశాం. అయితే గుజరాత్ రాజ్​కోట్​కు చెందిన సంగీతాబెన్ షా అనే మహిళ మాత్రం చనిపోయిన తన భర్తకు నివాళులను అర్పించేందుకు ఓ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. పేద ప్రజలకు రాయితీ అంబులెన్స్​ సేవలను అందించాలనే నిర్ణయం తీసుకుంది.

ఏడాదిన్నర క్రితం సంగీతాబెన్ భర్త హరేష్‌భాయ్ మన్సుఖ్లాల్ షా అనారోగ్యం పాలయ్యాడు. దీంతో చికిత్స నిమిత్తం ఆయనను ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. అయితే ఆ సమయంలో ఆమెకు అంబులెన్స్ చెల్లించడానికి డబ్బులు కూడా లేవు. ఈ కారణంగా సంగీతాబెన్ తన భర్తను ఆస్పత్రికి ఆలస్యంగా తీసుకెళ్లడం వల్ల ఆమె భర్త మరణించాడు. దీంతో అప్పటి నుంచి పేద ప్రజలకు సబ్సిడీ అంబులెన్స్​ సేవలను అందించాలని నిశ్చయించుకుంది. రాజ్​కోట్ నివాసి అయిన సంగీతాబెన్​ షా ముంబయికి చెందిన ఆల్ఫా ఫౌండేషన్​ సభ్యురాలు. గుజరాత్ రాష్ట్రంలో క్లిష్టపరిస్థితుల్లో ఉన్న రోగులకు అర్జెంట్​గా అంబులెన్స్ సేవ అవసరమైనప్పుడు.. ఆమె అధిక రాయితీతో వారికి ఆ సేవలను అందిస్తోంది. ఈ విధంగా పేద ప్రజల జీవితాలను రక్షించేందుకు ఆమె కృషి చేస్తోంది.

సబ్సీడీ ధరలో అంబులెన్స్ సేవలు అందిస్తున్న సంగీతాబెన్ షా

"ఏడాదిన్నర క్రితం చనిపోయిన నా భర్త హరేష్‌భాయ్ మన్సుఖ్లాల్ షా జ్ఞాపకార్థంగా ఈ అంబులెన్స్ సేవలను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాను. ఈ సేవల ద్వారా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్న రోగులను చికిత్స నిమిత్తం నేపాల్​కు కూడా తీసుకెళ్లగలిగాం. గుజరాత్​లోని రాజ్​కోట్​, మోర్బీ, అహ్మదాబాద్​ల నుంచి కూడా ఈ అంబులెన్స్ సేవలను అందిస్తున్నాం"

- సంగీతాబెన్ షా , అంబులెన్స్​ నిర్వాహకురాలు

సంగీతాబెన్ షా నిస్వార్థమైన కృషి వల్ల లబ్ధిపొందిన అనేక మందిలో జర్నా శర్మ కుటుంబం ఒకటి. ఇటీవల జర్నా కుటుంబం వ్యాపార పనుల కోసం నేపాల్​ నుంచి వచ్చారు. ఈ క్రమంలోనే అకస్మాత్తుగా ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చి అస్వస్థతకు గురైంది. దీంతో హుటాహుటిన రాజ్​కోట్​ సివిల్ హాస్పిటల్‌కు తరలించి.. చికిత్స అందించిన్నప్పటికీ ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తదుపరి చికిత్స కోసం నేపాల్​కు తిరిగి తీసుకుని వెళ్లాలనుకున్నారు. అయితే నేపాల్​కు అంబులెన్స్ ఛార్జీలు తమ తాహతకు మించి ఉన్నాయి. దీంతో ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో వారు సంగీతాబెన్​ షా అందించే సేవల గురించి తెలుసుకున్నారు. ఆమె సహాయంతో జర్నాను నేపాల్​ ఆసుపత్రికి తీసుకెళ్లగలిగారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details