ప్రకృతిని ప్రేమించడం మొదలుపెట్టాలే కానీ.. ఎలాంటి సమస్యలు లేకుండా జీవితం మొత్తాన్ని హాయిగా గడిపేయొచ్చు. ప్రకృతికి ప్రేమ లేఖలు రాస్తూ కాలక్షేపం చేసేయొవచ్చు. నిత్యం బిజీబిజీ జీవితాలతో యంత్రంలా పనిచేసే మనిషికి దాని విలువల తెలియదు. కానీ ఒక్కసారి ప్రకృతి పలకరిస్తే.. విడిచివెళ్లాలని అనిపించదు. ఇలాంటి ఎన్నో 'నేచర్ స్పాట్'లకు నెలవు భారత దేశం.
ఓవైపు వెచ్చని సూర్య కిరణాలు.. మరోవైపు వర్షపు చినికులు.. దూరంగా, దగ్గరగా కొండలు.. ఆ మధ్యలో ఇంద్ర ధనస్సు.. ఆ ప్రకృతి అందాన్ని ఆస్వాదించేందుకు సమయమే సరిపోదు! ఈ దృశ్యాలు మహారాష్ట్ర మాల్షెజ్ ఘాట్లో కనువిందు చేశాయి. పర్యటకులు వాటిని తమ కెమెరాల్లో బంధించారు.