తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మత్తు కోసం కొత్త పంథా.. కండోమ్‌తో ఆల్కహాల్‌.. నీటిలో నానబెట్టి.. - కండోమ్​తో ఆల్కహాల్

Condom alcohol: 'కండోమ్​తో ఆల్కహాల్ తయారీ'.. వినడానికే వింతగా, జుగుప్సాకరంగా ఉంది కదూ! కానీ భిన్న పద్ధతిలో కండోమ్​ను ఉపయోగించి మత్తుపానీయాన్ని తయారు చేస్తోంది బంగాల్​కు చెందిన యువత! దీంతో, ఫ్లేవర్డ్ కండోమ్​లన్నీ హాట్​కేకుల్లా అమ్ముడైపోతున్నాయి.

CONDOM ALCOHOL
alcohol condom making

By

Published : Jul 26, 2022, 6:47 PM IST

Condom alcohol news: మత్తులోకి జారుకునేందుకు యువత కొత్త మార్గాలను ఎంచుకుంటోంది. వైట్‌నర్‌, టూత్‌పేస్ట్‌ను భిన్న పద్ధతిలో వినియోగించి మత్తులో చిత్తవుతున్న యువత.. తాజాగా మరో మార్గాన్ని కనుగొంది. అదే 'కండోమ్‌ ఆల్కహాల్‌‌'. ఇదేంటి అని ఆశ్చర్యపోతున్నారా? బంగాల్‌లోని దుర్గాపుర్‌ సహా మరికొన్ని ప్రాంతాల యవత ఈ కండోమ్‌ ఆల్కహాల్‌కి బానిసయ్యారు. ఎంతలా అంటే.. ఫ్లేవర్డ్‌ కండోమ్‌లు అక్కడ హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

కండోమ్‌లలో సుగంధ సమ్మేళనాలు ఉంటాయి. కండోమ్‌లను వేడి నీటిలో ఎక్కువసేపు నానబెట్టడం వల్ల అందులోని ఆర్గానిక్ అణువులు ఆల్కహాలిక్ సమ్మేళనాలుగా విచ్ఛిన్నమై ఆల్కహాల్‌గా మారుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. హానికరం అయినప్పటికీ.. ఈ కండోమ్‌ నీటిని దుర్గాపుర్‌ యువత విచ్చలవిడిగా వాడుతోందని స్థానికులు, అక్కడి వైద్యులు పేర్కొంటున్నారు. వీరిలో చదువుకుంటున్న యువత సైతం ఉన్నారు.రబ్బరుతో తయారయ్యే ఈ కండోమ్‌ల నుంచి డెండ్రైట్స్ జిగురును తీస్తున్నారని, దాన్ని కూడా యువత మత్తులా వినియోగిస్తోందని తేలింది.

కాగా యువత కండోమ్‌లను విచ్చలవిడిగా కొనుగోలు చేసి మత్తులో చిత్తవుతోంది. బయట దొరికే మద్యంతో పోలిస్తే ఇది బాగా చీప్‌ కావడంతో యువత దీని వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. దుర్గాపూర్‌లోని ఓ మెడికల్‌ షాప్‌ యజమాని మాట్లాడుతూ.. 'గతంలో రోజుకు 3, 4 ప్యాకెట్ల కండోమ్‌లను విక్రయించేవాళ్లం. కానీ ఇప్పుడు తెచ్చినవి తెచ్చినట్లుగా అమ్ముడవుతున్నాయి' అని పేర్కొన్నాడు. కాగా ఇది ఆరోగ్యానికి హానికరమని, ఇలాంటివి ప్రయత్నించొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details