తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నగ్న వీడియోలతో మహిళా ప్రొఫెసర్​కు బ్లాక్​మెయిల్.. కుమార్తెపై తండ్రి అత్యాచారం!

మహరాష్ట్రలో ఓ మహిళ ప్రొఫెసర్​ను నగ్నంగా వీడియో తీసిన ఓ విద్యార్థి.. దాన్ని ఆధారంగా చేసుకుని బాధితురాలి నుంచి రూ. 4లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. మరో వైపు ఇదే రాష్ట్రంలో మైనర్​పై తండ్రి, పక్కింటి వ్యక్తి అత్యాచారం చేశారు. బాలిక గర్భం దాల్చడం వల్ల విషయం వెలుగులోకి వచ్చింది.

student-recorded-woman-professor-naked-video-and-demanded-4-lakhs-in-maharashtra
మహిళా ప్రొఫెసర్​ను నగ్నంగా వీడియో తీసిన విద్యార్థి

By

Published : Jun 24, 2023, 8:09 PM IST

మహిళ ప్రొఫెసర్​ను నగ్నంగా వీడియో తీసి బ్లాక్​మెయిల్ చేశాడు ఓ విద్యార్థి. ఆ వీడియోను ఆమెతో పాటు ఆమె భర్తకు పంపించి వారి నుంచి రూ. 4లక్షలను డిమాండ్ చేశాడు. మహరాష్ట్రలోని ఓ యూనివర్సిటీలో ఈ ఘటన జరిగింది. నిందితుడ్ని 26 ఏళ్ల మయాంక్​ సింగ్​గా పోలీసులు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు బిహార్​కు చెందిన వ్యక్తి. ప్రస్తుతం పుణెలోని ఓ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. కాగా నిందితుడు మొదట్లో ఇన్​స్టాగ్రామ్​ ద్వారా మహిళా ప్రొఫెసర్​తో చాటింగ్ చేసేవాడు. ఆ తరువాత డైరెక్ట్​గా ఫోన్​, వాట్సాప్​ కాల్​ చేయడం ప్రారంభించాడు. సడెన్​గా ఒకరోజు ప్రొఫెసర్​కు వీడియో కాల్​ చేసి.. తాను చెప్పినట్లు చేయాలని ఆమెను బెదిరించాడు. లేకపోతే వారి మధ్య జరిగిన సంభాషణను యూనివర్సిటీలో బయటపెడతానని హెచ్చరించాడు. దాంతో భయపడిపోయిన మహిళ ప్రొఫెసర్​.. నిందితుడు చెప్పినట్లు చేసింది.

"ప్రొఫెసర్​కు వీడియో కాల్​ చేసిన నిందితుడు.. ఆమె శరీరంపై బట్టలను తీసేయాలని బెదిరించాడు. అతడు చెప్పినట్లు చేయకపోతే ఎక్కడ పరువు తీస్తాడన్న భయంతో.. నిందితుడు చెప్పినట్లే ఆమె చేసింది. ఆ దృశ్యాలను రికార్డ్​ చేసిన నిందితుడు.. అనంతరం బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో భార్యభర్తలిద్దరూ పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై వారికి ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నాం" అని పోలీసులు తెలిపారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామన్నారు.

మైనర్​పై తండ్రి, పక్కింటి వ్యక్తి అత్యాచారం..
మైనర్​ కుమార్తెపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ తండ్రి. అతనితో పాటు ఇంటిపక్కన ఉన్న మరో వ్యక్తి కూడా.. బాలికపై ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాధితురాలు గర్భం దాల్చడం వల్ల విషయం వెలుగులోకి వచ్చింది. మహరాష్ట్రలోని ముంబయిలో ఈ దారుణం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిలక్​ నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ ఘటన జరిగింది. 2023 ఫిబ్రవరిలో 32 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి.. పక్కింట్లో నివాసం ఉండే 17 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లిదండ్రులను సంప్రదించాడు. దానికి వారు కూడా ఒప్పుకోవడం వల్ల.. ఇరువురి కుటుంబాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడింది. దీంతో పలుమార్లు బాలికపై ఆ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయాన్ని ఎవ్వరికి చెప్పవద్దని బాలికను బెదిరించాడు.

ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి 28న బాధితురాలి తల్లి పనిమీద బయటకు వెళ్లింది. అప్పుడు ఇంట్లో బాలిక, ఆమె తండ్రి మాత్రమే ఉన్నారు. అదే సమయంలో వారిద్దరి మధ్య కాస్త వాగ్వాదం జరిగింది. దీంతో కూతురుపై తండ్రి అత్యాచారం చేశాడు. ఈ మధ్యే బాధితురాలు గర్భం దాల్చడం వల్ల ఈ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. జరిగిందంతా బాధితురాలు తన తల్లికి చెప్పింది. అనంతరం ఇద్దరు కలిసి పోలీసులను ఆశ్రయించారు. నిందితులపై వారికి ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. గురువారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు నిజం ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details