తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వందకు 151 మార్కులు.. అయినా ఫెయిల్.. సున్నా వచ్చిన విద్యార్థి పాస్! - వందకు 150 మార్కులు

సాధారణంగా 100కు 35 మార్కులు వస్తే పాస్ అయినట్లే.. టాపర్లు అయితే వందకు 90కి పైగా మార్కులు తెచ్చుకుంటారు.. అలాంటిది వందకు 150కి పైగా మార్కులు వస్తే...? అయినప్పటికీ ఆ విద్యార్థి ఫెయిల్ అయితే? బిహార్​లో అలాగే జరిగింది.. వివరాల్లోకి వెళ్తే..

lalit-narayan-mithila-university-darbhanga
lalit-narayan-mithila-university-darbhanga

By

Published : Aug 1, 2022, 3:47 PM IST

151 marks out of 100:బిహార్ దర్భంగా జిల్లాలోని లలిత్ నారాయణ్ మిథిలా యూనివర్సిటీ నిర్లక్ష్యం.. విద్యార్థులకు ఇబ్బందులను తెచ్చిపెట్టింది. కొందరికి గరిష్ఠానికి మించి మార్కులు రాగా.. ఇంకొందరికి గుండు సున్నాలు వచ్చాయి. పలువురు విద్యార్థులు ఫెయిల్ అయినట్లు ప్రకటించి.. వారిని పైతరగతికి ప్రమోట్ అయినట్లు మార్క్​షీట్లో పేర్కొనడం చర్చకు దారి తీసింది.

లలిత్ నారాయణ్ మిథిలా యూనివర్సిటీ ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఫలితాల్లో ఎంఆర్జేడీ కాలేజీకి చెందిన బీఏ మూడో ఏడాది విద్యార్థి అన్మోల్ కుమార్​కు.. 'పొలిటికల్ సైన్స్ హానర్స్' నాలుగో పేపర్​లో 151 మార్కులు వచ్చాయి. ఈ పేపర్​లో గరిష్ఠ మార్కులు 100 కాగా.. అంతకుమించి మార్కులు రావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మొత్తం 420 మార్కులు వచ్చాయి. అయితే, మార్క్​షీట్​లో మాత్రం అతడు ఫెయిల్ అయినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫలితాలు చూసి విద్యార్థి అయోమయానికి గురవుతున్నాడు. మరోవైపు, యూనివర్సిటీ పరిధిలోని ఎంకేఎస్ కళాశాలలో చదువుతున్న సోనూ కుమార్​కు.. ఓ పేపర్​లో గుండుసున్నా వచ్చాయి. అకౌంటెన్సీ, ఫైనాన్స్ హానర్స్ నాలుగో పేపర్​లో సున్నా మార్కులు వచ్చినట్లు ఫలితాల్లో తేలింది. అయినప్పటికీ పరీక్షలో పాసైనట్లు మార్క్​షీట్​లో కనిపించింది.

ఫలితాలపై స్పష్టత కరవైన నేపథ్యంలో అన్మోల్ కుమార్.. కళాశాల ప్రిన్సిపల్​ను సంప్రదించాడు. అనంతరం, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో స్పందించిన యూనివర్సిటీ యంత్రాంగం.. తొలుత విద్యార్థుల మార్క్​షీట్లను వెబ్​సైట్ నుంచి తొలగించింది. అనంతరం ఫలితాలను సరిచేసింది. ఇద్దరికీ కొత్త మార్క్​షీట్లు జారీ చేసినట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ముస్తాక్ అహ్మద్ తెలిపారు. టైపింగ్ దోషాల వల్ల ఇలా జరిగిందని తెలిపారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details