యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన 2019 పుల్వామా దాడి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడికి న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.
కర్ణాటక కచారక్నహళ్లికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ఫైజ్ రషీద్.. 2019లో పాకిస్థానీ ఉగ్రమూకలు చేసిన పుల్వామా దాడిని ఉద్దేశించి ఫేస్బుక్లో అనుచిత వ్యాఖ్యలు చేశాడు. సామాజిక మాధ్యమాల్లో పలు న్యూస్ ఛానళ్లు చేసిన పోస్టులకు వివాదాస్పద కామెంట్లు పెట్టాడు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అప్పుడే అరెస్టు చేశారు. రషీద్ ఫోన్ స్వాధీనం చేసుకుని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. అప్పటి నుంచి నిందితుడు రిమాండ్‌లోనే ఉన్నాడు. బెయిల్ పిటిషన్‌ను కోర్టు పలు మార్లు తిరస్కరించింది.
ఎట్టకేలకు రషీద్ కేసులో తీర్పు వెలువడింది. న్యాయస్థానం అతడికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.25,000 జరిమానా విధించింది.
పుల్వామా ఘటనపై అనుచిత వ్యాఖ్యలు.. విద్యార్థికి ఐదేళ్ల జైలు శిక్ష
2019లో జరిగిన పుల్వామా దాడి గురించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థికి కర్ణాటకలోని ప్రత్యేక కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.
Student gets 5-year jail term for celebrating Pulwama attack
TAGGED:
pulwama attack attack 2019