ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపుర్‌లో దారుణం జరిగింది. కళాశాల ప్రిన్సిపల్‌పై ఓ విద్యార్థి కాల్పులు జరిపాడు. ఈ ఘటన జహంగీరాబాద్‌లోని సదర్‌పుర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.
అసలేం జరిగిందంటే..జహంగీరాబాద్‌లోని ఆదర్శ్ రామస్వరూప్ విద్యాలయ ఇంటర్మీడియట్ కాలేజీలో 12వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య శుక్రవారం గొడవ జరిగింది. అందులో ఓ విద్యార్థి మరో విద్యార్థిపై దాడి చేశాడు. ఈ విషయం కళాశాల ప్రిన్సిపల్ రామ్ సింగ్ వర్మ దృష్టికి చేరింది. దీంతో ప్రిన్సిపల్.. ఓ విద్యార్థిని మందలించాడు. ఈ క్రమంలో ప్రిన్సిపల్‌పై కోపం పెంచుకున్న స్టూడెంట్ శనివారం.. కాలేజీకి వచ్చేటప్పుడు తన వెంట తుపాకీ తెచ్చుకుని కాల్పులు జరిపాడు.
ఈ దాడిలో ప్రిన్సిపల్ తల, కడుపు, నడుము భాగంలో బుల్లెట్ గాయాలయ్యాయి. వెంటనే నిందితుడు ఘటనాస్థలి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న సదర్‌పుర్ పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని ప్రిన్సిపల్ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అతడి కుటుంబసభ్యులు రామ్సింగ్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడం వల్ల వైద్యులు సూచన మేరకు జిల్లా ఆస్పత్రికి తరలించారు.