తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐఐటీ క్వారంటైన్​ సెంటర్​లో ఓ విద్యార్థి మృతి

విశ్వవిద్యాలయాల్లోనూ కొవిడ్​ వ్యాప్తి ప్రభావం తీవ్రంగా ఉంది. ఐఐటీ రూర్కీలో వైరస్​ పంజా విసురుతోంది. మొత్తం 120 మంది విద్యార్థులకు వైరస్​ సోకగా.. క్వారంటైన్​లో ఉన్న ఓ విద్యార్థి బుధవారం మృతి చెందాడు.

IIT roorkee
ఆ ఐఐటీలో కొవిడ్ పంజా-ఓ విద్యార్థి మృతి

By

Published : Apr 15, 2021, 4:56 PM IST

దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఉత్తరాఖండ్​లోని ఐఐటీ రూర్కీలోనూ కరోనా పంజా విసురుతోంది. బుధవారం.. ప్రేమ్​ సింగ్ అనే విద్యార్థి క్వారంటైన్​ సెల్​లో ఉండగానే మృతి చెందాడు. అయితే.. ఆర్టీపీసీఆర్​ టెస్టులో ఆయనకు నెగెటివ్​గా నిర్ధరణ అయింది. కొవిడ్​ సోకిన వ్యక్తితో కాంటాక్ట్​ అయినందున ప్రేమ్​ సింగ్​ను క్వారంటైన్​లో ఉంచామని యాజమాన్యం పేర్కొంది.

ఐఐటీ రూర్కీలో.. ప్రేమ్​ సింగ్​ ఎర్త్​క్వేక్ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం క్వారంటైన్​ సెల్​లో అనుమానస్పదంగా పడి ఉన్న నేపథ్యంలో అతడ్ని రూర్కీ సివిల్ ఆసుపత్రికి తరలించారు యూనివర్సిటీ సిబ్బంది. అయితే.. అప్పటికే అతడు మృతిచెందినట్లు సివిల్ ఆసుపత్రి డాక్టర్లు స్పష్టం చేశారు. పోస్టుమార్టం తర్వాతే ప్రేమ్ మృతికి కారణమేంటో తెలుస్తుందని చెప్పారు.

మొత్తంగా ఐఐటీ రూర్కీలో 120 మంది విద్యార్థులకు కొవిడ్​ సోకింది. వీరితో పాటు యాజమాన్యంలోనూ చాలా మంది వైరస్​ బారినపడ్డారు.

ఇదీ చదవండి:కుంభమేళాలో 1,701 కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details