ఉత్తర్‌ప్రదేశ్‌లో విషాదకర ఘటన జరిగింది. న్యాయవిద్య చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం తాను ఉంటున్న హస్టల్ గదిలోనే ఉరి వేసుకుని చనిపోయింది.
హాస్టల్ గదిలో ఉరేసుకుని LAW విద్యార్థిని ఆత్మహత్య - University student suicide at hostel room
ఉత్తర్‌ప్రదేశ్‌లో న్యాయవిద్య చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. శనివారం హాస్టల్ గదిలోనే ఉరివేసుకుని చనిపోయింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతాప్‌గఢ్ జిల్లా జెత్వారా గ్రామానికి చెందిన కోమలి అనే విద్యార్థి లఖ్‌నవూలోని ఎస్ఎమ్ఎన్ఆర్ యూనివర్సిటీలో ఎల్ఎల్బీ మూడో సంవత్సరం చదువుతోంది. ఆమె గత మూడేళ్లుగా స్నేహనగర్‌లోని సాహ్ని హాస్టల్‌లోనే ఉంటుంది. శుక్రవారం రాత్రి రూమ్‌లోకి వెళ్లిన కోమలి.. ఉదయమైనా బయటకు రాలేదు. అనుమానం వచ్చిన స్నేహితురాళ్లు డోర్ కొట్టగా.. తీయలేదు. దీంతో ఆమె ఇంకా నిద్రలోనే ఉండొచ్చని భావించి వదిలేశారు. సాయంత్రం రూమ్ శుభ్రం చేయడానికి వచ్చిన స్వీపర్.. కోమలి రూమ్ డోర్ తట్టింది. అయినా ఆమె తలుపు తీయకపోవడం వల్ల పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కోమలి రూమ్ డోర్ విరగకొట్టి లోపలికి వెళ్లగా కోమలి ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందిచారు పోలీసులు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకొని పోస్ట్‌మార్టం పరీక్షల కోసం మృతదేహన్ని ఆస్పత్రికి తరలించారు. కోమలి ఆత్మహత్యకు సంబంధించి ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదని వారు తెలిపారు. ఈ మధ్య కోమలి తీవ్ర ఆందోళనకు గురైందని ఆమె తండ్రి తెలిపారు.