తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అతిథి మర్యాదలు చేసిపెట్టే రోబో.. తయారీ ఖర్చు రూ.2వేలు మాత్రమే! - టింగ్ టాంగ్​ బిజినెస్​ లిస్టింగ్​ యాప్​

పనికిరాని వస్తువులతో ఓ యువకుడు రోబోను రూపొందించాడు. ఆహారం, నీళ్లు అందించేలా.. ఇతర ఇంటి పనులు చేసిపెట్టేలా తీర్చిదిద్దాడు. దీన్ని తయారు చేయడానికి రూ.2 వేలు ఖర్చు అయిందని తెలిపాడు. మరోవైపు, ఓ వ్యక్తి నిరుద్యోగుల కోసం ఓ యాప్​ తీసుకువచ్చాడు. యువతలోని ట్యాలెంట్​ను వినియోగదారుల వద్దకు చేర్చేలా టింగ్​ టాంగ్​ అనే యాప్​ను రూపొందించాడు.

Siliguri polytechnic student makes robot out of scrap
Siliguri polytechnic student makes robot out of scrap

By

Published : Apr 27, 2023, 10:24 AM IST

అతిథి మర్యాదలు చేసిపెట్టే రోబో.. అబ్బురపరుస్తున్న 4 చక్రాల 'బిధు శేఖర్​'

ఇంట్లోని పనికిరాని వస్తువులతో ఓ రోబో​ను తయారుచేశాడు బంగాల్​కు చెందిన దేబాశిష్ దత్తా అనే యువకుడు. ఇంటికి వచ్చిన అతిథులకు ఆహారం, నీళ్లు అందించడం సహా వివిధ పనులు చేసిపెట్టేలా ఆ మరమనిషిని తీర్చిదిద్దాడు. అవార్డు ఫంక్షన్లలో పురస్కారాలు సైతం ఇది ప్రదానం చేస్తుందని అతడు చెబుతున్నాడు.

దేబాశిష్​ దత్తా.. సిలిగుడికిలో బాగ్డోగ్రా ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. నగరంలోని పాలిటెక్నిక్​ కళాశాలలో రెండో ఏడాది చదువుతున్న దేబాశిష్​కు రోబోలంటే చాలా ఇష్టం. వాటిని తయారుచేయాలని కలల కనేవాడు. కానీ, వాటిని తయారు చేసేంత ఆర్థిక స్తోమత లేదు. అయినా పట్టువిడవకుండా ఇంట్లో పనికిరాని వస్తువులతో.. రెండు నెలలు శ్రమించి ఓ రోబోను తయారుచేశాడు. సీ-ప్రోగ్రామింగ్​ సహాయంతో.. కోడింగ్ చేశాడు. రోబోకు 'బిధు శేఖర్'​ అని పేరు పెట్టాడు. ఆ మరమనిషిని తయారు చేయడానికి 2వేల రూపాయలు మాత్రమే ఖర్చు అయిందని చెప్పాడు దేబాశిష్​.

రోబోతో దేబాశిష్​

ఈ రోబో​కు నాలుగు చక్రాలు అమర్చి.. బ్లూటూత్​తో అనుసంధానం చేశాడు దేబాశిష్. రోబోను నియంత్రించడానికి రిమోట్ యాప్​ను రూపొందించాడు. మొబైల్ ఫోన్​లోని ఆ యాప్​ ద్వారా రోబోను కదిలించవచ్చు. ఇంట్లోకి ఎవరైనా అతిథులు వస్తే.. వారికి టీ, టిఫిన్లు అందించడానికి రోబోను ఉపయోగించుకోవచ్చని దేబాశిష్ చెబుతున్నాడు. ఈ చిన్ని రోబో మన బదులు అటూ ఇటూ తిరుగుతూ పనులన్నీ చేసేస్తుందని అంటున్నాడు. ఏదైనా ఈవెంట్లలో అవార్డులు కూడా అందిస్తుందని తెలిపాడు.

భవిష్యత్తులో ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ను ఉపయోగించి ఇంకా మెరుగైన రోబోను తయారుచేయాలనేది తన కోరికని చెబుతున్నాడు దేబాశిష్​. ఆ రోబ్​కు కెమెరా అమర్చి.. అడ్డంకులు గుర్తించేలా చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. వివిధ పనులను సులభంగా చేయగల.. నాణ్యమైన రోబోలను రూపొందించే వ్యాపారం చేయాలనే ఆసక్తితో ఉన్నట్లు చెప్పాడు.

టీలు అందిస్తున్న రోబో
రిమోట్​తో నియంత్రిస్తున్న రోబో

మురికి వాడల వాళ్ల వ్యథలు చూడలేక..
ముంబయి మురికివాడల నుంచి వచ్చి.. వ్యాపారం చేసి ఉన్నత స్థాయికి ఎదిగాడు ఉదయ్​ పవార్​ అనే వ్యక్తి. కానీ, తాను గతంలో నివసించిన మురికివాడల యువకులు చెడు అలవాట్లకు బానిసై నేరగాళ్లలా ఉన్నారు. వీటన్నింటికీ నిరుద్యోగమే కారణమని.. యువతకు ఎలాగైనా ఉపాధి కల్పించాలని అనుకున్నారు ఉదయ్​. ఆ ఆలోచననే ఆచరణలో పెట్టి.. తన స్నేహితుల సహాయంతో 'టింగ్​ టాంగ్​' అనే యాప్​ను రూపొందించారు.

' మురికివాడల నుంచి వచ్చామంటే చాలా మంది హీనంగా చూస్తారు. కానీ, ఇలాంటి వాడల్లో నివసించే వాళ్లకు ఒక్కోరకమైన గుణాలు, నైపుణ్యాలు ఉంటాయి. అవి బయటవారికి కనిపించవు. ఆ నైపుణ్యాలతోనే ఉపాది పొందొచ్చు. ఇక్కడ ఉండే తండ్రులు, భార్యలు, చెల్లెళ్లు తమ వారికి ఏమైనా ఉద్యోగాలుంటే చూడండి అంటుంటారు. వారికి ఉద్యోగాలు ఇవ్వలేకపోయాను. కానీ, వారి కోసమే ఈ యాప్​ రూపొందించాను. ఇక్కడున్న వారికి ప్లంబర్​, ఎలెక్ట్రిషియన్​ లాంటి పనులు వచ్చినా.. వారు ఈ యాప్​లో రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్​ కోసం ఏడాదికి రూ.365 చెల్లించాల్సి ఉంటుంది. ఎవరికైనా ఏదైనా అవసరం అయితే.. వారు ఇందులో రిజిస్టర్​ అయిన వాళ్లను సంప్రదిస్తారు. అలా పని సేవలను వినియోగదారులకు చేరతాయి. అయితే, ఇతర యాప్​లాగా ఇందులో కమిషన్ ఉండదు​' అని ఉదయ్​ పవార్​ వివరించారు.

ఉదయ్​ పవార్​, టింగ్​ టాంగ్ యాప్​ రూపకర్త

ABOUT THE AUTHOR

...view details