డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకుంటే ఇక నుంచి కఠినమైన నైపుణ్య పరీక్షల్లో ఉత్తీర్ణులు అవడం తప్పనిసరి అని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఈ స్కిల్ టెస్టులలో భాగంగా అధికారులు సూచించిన విధంగా వాహనం రివర్స్ చేయడం వంటివి చేయాలని పేర్కొన్నారు. డ్రైవింగ్ టెస్ట్‌లో ఉత్తీర్ణులు అవ్వాలంటే పాస్ పర్సెంటేజ్ 69 శాతం దాటి ఉండాలని తెలిపారు. గురువారం జరిగిన పార్లమెంటు సమావేశాల్లో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానాల్లో ఈ విధంగా పేర్కొన్నారు.
"ఆర్టీఓల్లో పాస్ పర్సెంటేజ్ 69 శాతంగా కొనసాగుతుంది. సమర్థమంతమైన డ్రైవర్లుగా తీర్చిదిద్దేందుకు ఈ తరహా కఠినమైన పరీక్షలు నిర్వహిస్తున్నాము. డ్రైవింగ్ టెస్ట్ కన్నా ముందు ఇందుకు సంబంధించి అవగాహన కోసం ఎల్ఈడీ స్క్రీన్‌పైన ప్రదర్శన నిర్వహిస్తారు. లైసెన్స్, రిజిట్రేషన్లకు సంబంధించిన సేవలను ప్రజలకు సులభతరం అయ్యేలా వాటిని ఆన్లైన్ చేశాము."