మహారాష్ట్రలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న క్రమంలో 'కఠినమైన లాక్డౌన్' విధించాలని కేబినేట్ సూచించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బుధవారం ప్రకటన జారీ చేసే అవకాశం ఉందని వివరించారు.
పదోతరగతి పరీక్షలను సైతం రద్దు చేయాలని కేబినేట్ నిర్ణయించినట్లు ఆ రాష్ట్ర మంత్రులు రాజేశ్ తోపే, ఏక్నాథ్ షిండే పేర్కొన్నారు.
"రాష్ట్రంలో కొవిడ్-19ను కట్టడి చేసేందుకు కఠినతరమైన లాక్డౌన్ విధించాలని కేబినేట్ సూచించింది. పదోతరగతి పరీక్షలను సైతం రద్దు చేయాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది. దీనిపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బుధవారం అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది."