తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వీధి కుక్కల దాడి- 12 ఏళ్ల బాలిక మృతి - బాలిక మృతి

ఉత్తర్​ప్రదేశ్​ పీలీభీత్​ జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. వీధి కుక్కల దాడిలో 12 సంవత్సరాల బాలిక మృతిచెందింది.

Stray dogs maul teenager to death in Uttar Pradesh
వీధి కుక్కల దాడి- 12 ఏళ్ల బాలిక మృతి

By

Published : Jan 6, 2021, 6:30 PM IST

వీధికుక్కల దాడిలో 12 సంవత్సరాల బాలిక మృతిచెందిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని పీలీభీత్​ జిల్లాలో మంగళవారం జరిగింది. కొత్తిమీర కోసం పంటపొలాల్లోకి వెళ్తుండగా.. శునకాల సమూహం ఆమెపై దాడికి దిగినట్లు స్థానికులు చెబుతున్నారు. భయంకరమైన ఆ కుక్కల నుంచి ఎవ్వరూ బాలికను కాపాడలేకపోయినట్లు తెలిపారు. తీవ్రగాయాలై ప్రాణాలు కోల్పోయిందని వెల్లడించారు. ఈ ఘటనతో ఊళ్లో రోదనలు మిన్నంటాయి.

బాలిక మృతదేహం

ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ జైప్రకాశ్​ యాదవ్​.. మృతదేహాన్ని శవపరీక్ష కోసం తరలించినట్లు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడతామని అన్నారు. వీధి కుక్కలను పట్టి.. దూరంగా వదిలేయాలని ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఆదేశించిందని పేర్కొన్నారు.

బంధువుల రోదనలు

ఇదీ చూడండి:బిహార్​లో కాంగ్రెస్ ఖాళీ- ఎన్డీఏలోకి ఎమ్మెల్యేలు!

ABOUT THE AUTHOR

...view details