తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్రాణ' స్నేహితులంటే వీరేనేమో.. మృత్యువులోనూ వీడని బంధం.. ఒకే రోజు ఇద్దరూ మృతి

70 ఏళ్ల పాటు కలిసిమెలిసి ఉన్న ఆ ఇద్దరు మిత్రులు కొన్ని గంటల తేడాలోనే అనంతలోకాలకు చేరారు. బాల్యంలో ఏర్పడిన వీరి స్నేహం.. 7 దశాబ్దాలు పాటు కొనసాగి మరణంలోనూ విడదీయలేని బంధంగా మారింది. దీంతో ఇరు కుటుంబాల్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే?

Story of two friends in Prayagraj
Story of two friends in Prayagraj

By

Published : Dec 16, 2022, 7:02 PM IST

"కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట.. రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం.. రూపు రేఖలు వేరట ఊపిరొకటే చాలట.. ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం" అంటూ ఆడిపాడిన ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఇద్దరు స్నేహితులిద్దరు మృతి చెందారు. ఇద్దరు మిత్రులు 70 ఏళ్ల పాటు కలిసి ఉన్నారు. వారిలో ఒకరు అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మరో మిత్రుడు.. తన స్నేహితుడి మృతదేహాన్ని పట్టుకొని ఏడుస్తూ తన ప్రాణాలు కూడా విడిచాడు.

ఇదీ జరిగింది..
ప్రయాగ్​రాజ్​ జిల్లా తవాయి ప్రాంతానికి చెందిన రామ్​ కృపాల్, మసూరుద్దీన్​ చిన్నప్పటి నుంచి స్నేహితులు. చిన్నప్పుడు రోజంతా ఆడుతూపాడుతూ గడిపేవారు. నిద్రించడానికి మాత్రమే తమ ఇళ్లకు వెళ్లేవారు. యవ్వనంలోనూ వారిద్దరూ కలిసి ఒకే దగ్గర పనిచేసేవారు. వృద్ధాప్యంలోనూ కలిసి విహారయాత్రలకు వెళ్లేవారు. ఈ విధంగా కలిసి జీవించారు. వృద్ధాప్యంలో కూడా వారిద్దరూ కలిసి చనిపోవడం గురించే మాట్లాడుకునేవారు.

రామ్​ కృపాల్, మసూరుద్దీన్

అయితే కొద్ది రోజులుగా మసూరుద్దీన్​ ఆరోగ్యం దెబ్బతింది. దీంతో రామ్​ కృపాల్​ ప్రతిరోజూ మిత్రుడు ఇంటికి వెళ్లి అతడి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరాతీస్తూ ఉండేవాడు. అనారోగ్యం కారణంగా మసూరుద్దీన్​ గురువారం ఉదయం మరణించాడు. మసూరుద్దీన్​ కుటుంబసభ్యులు ఈ విషయాన్ని రామ్​కు తెలియనివ్వలేదు. ఎలాగోలా మిత్రుడి మరణవార్త తెలుసుకొన్న రామ్​ కృపాల్​ షాక్​కు గురయ్యాడు. బోరున విలపిస్తూ మిత్రుడి ఇంటికి చేరుకున్నాడు. మిత్రుడి మృతదేహాన్ని కౌగిలించుకొని.. దేవుడా మిత్రుడి లేని ప్రపంచం నుంచి తనను కూడా తీసుకెళ్లమని ప్రార్థించాడు. అలా అన్న కొద్దిక్షణాల్లోనే రామ్​ కూడా ప్రాణాలు విడిచాడు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

ఇరు కుటుంబసభ్యులు ఇద్దరి అంత్యక్రియలు కలిసి పూర్తి చేయాలనుకున్నారు. కానీ మసూరుద్దీన్​ కొడుకు వేరే రాష్ట్రంలో ఉన్నాడు. మసూరుద్దీన్​ కొడుకు రావడానికి కాస్త ఆలస్యం కావడం వల్ల.. గురువారం రామ్​ కృపాల్ అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం శుక్రవారం మసూరుద్దీన్​ అంత్యక్రియలు పూర్తి చేశారు. వీరిద్దరి స్నేహం చూడముచ్చటగా ఉండేదని గ్రామస్థులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details