తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒకప్పుడు ఐఐటీ ఇంజినీర్​.. ఇప్పుడు యాచకుడు - Ashram Swarg - by Vikas Goswami

జీవితం ఎప్పుడు ఎవరిని ఎలా మార్చేస్తుందో తెలీదు. సరిగ్గా ఇలాగే.. ఓ వ్యక్తి జీవితంలో జరిగింది. ఐఐటీ కాన్పుర్​ నుంచి ఇంజినీరింగ్​ పూర్తి చేసిన ఆయన.. ప్రస్తుతం రోడ్లపై యాచిస్తూ బతుకుతున్నారు.

Storms of life changed everything for IITian made him a beggar
ఒకప్పుడు ఐఐటీ ఇంజినీర్​.. ఇప్పుడు యాచకుడు

By

Published : Dec 9, 2020, 4:44 PM IST

అవి మధ్యప్రదేశ్​లోని గ్వాలియర్​ నగర వీధులు.. అక్కడ ఓ వృద్ధుడు చలిలో రోడ్డుపై వణుకుతూ ఉన్నాడు. ఆ దయనీయ స్థితిలో ఉన్న ఆయనను చూసి కొంతమంది పలకరించారు. తీరా.. ఆయన మాటలు విని, ఆశ్చర్యపోవడం వారి వంతైంది. వారి ప్రశ్నలకు అనర్గళంగా ఆంగ్ల భాషలో సమాధానం ఇచ్చాడు ఆ వృద్ధుడు. ఆయనే.. 90 ఏళ్ల సురేందర్​ వశిష్ఠ.

రోడ్డుపై దయనీయ స్థితిలో సురేందర్​

ఐఐటీ కాన్పుర్​ నుంచి పట్టా..

గ్వాలియర్​ నగర వీధుల్లో సురేందర్ ఎన్నో ఏళ్లుగా యాచిస్తూ బతుకుతున్నారు. కానీ, ఆయన ఒకప్పుడు ఎంతో ఉన్నతమైన జీవితం గడిపిన వ్యక్తి. 1969లో ఐఐటీ కాన్పుర్​లో మెకానికల్​ ఇంజినీరింగ్​ పూర్తి చేశారు. 1972లో లఖ్​నవూలోని డీఏవీ కళాశాల నుంచి మాస్టర్స్​ ఆఫ్​ లా(ఎల్​ఎల్​ఎమ్)​లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. ఆ తర్వాత పోలీసు అధికారిగా, మెకానికల్​ ఇంజినీర్​గా.. ఇలా అనేక ప్రైవేటు కంపెనీల్లో మంచి హోదాల్లో పనిచేశారు. ఏమైందో తెలియదు.. ఒకప్పుడు హుందాగా బతికిన సురేందర్.. ఇప్పుడిలా దుర్భర పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తున్నారు.

తన గాథను వివరిస్తున్న సురేందర్​

"గ్వాలియర్​లోని మహాదిగ్​ సాహెబ్​లో నేను పుట్టాను. ఓ పత్తి మిల్లులో మా తండ్రి పని చేసేవారు. ఆయన నన్ను ఎంతో ప్రేమగా పెంచారు. నాకు 8 మంది తోబుట్టువులు. అందరిలో నేేనే చిన్నవాడిని. ఇప్పుడు వారంతా చనిపోయారు. ఒక సోదరి మాత్రమే ఇండోర్​లో నివసిస్తోంది. నేను 1969లో ఐఐటీ కాన్పుర్​లో మెకానికల్​ ఇంజినీరింగ్​ పూర్తి చేశాను.

-- సురేందర్​

సురేందర్​ను వృద్ధాశ్రమానికి తరలిస్తున్న 'ఆశ్రమ్​ స్వర్గ్​' స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు
ఆశ్రమంలో సురేందర్​

సురేందర్​ గురించి తెలుసుకున్న ఆశ్రమ్​ స్వర్గ్​ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు వికాస్ ​గోస్వామి.. ఆయనను తమ వృద్ధాశ్రమానికి తరలించారు. అయితే.. తాను ఇలా ఎందుకు మారాల్సి వచ్చిందో చెప్పలేదు సురేందర్​. తనకు పెళ్లైందని, ఓ ప్రమాదం అనంతరం తనను భార్య వదిలి వెళ్లిపోయిందని అన్నారు. కానీ, సురేందర్​కు వివాహం జరగలేదని ఆయన బంధువుల్లో ఒకరు చెప్పారు. ప్రస్తుతం బరేలీకి వెళ్లి తన బంధువులతో నివసించాలని ఆశపడుతున్నారు సురేందర్​.

ఇదీ చూడండి:అటవీ సంరక్షణలో 'అతడే ఒక సైన్యం'

ABOUT THE AUTHOR

...view details