తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చికెన్​ విషయంలో గొడవ.. రెండువర్గాల మధ్య భీకర రాళ్ల దాడి.. కర్ఫ్యూ విధింపు - లా స్టూడెంట్​ కిడ్నాప్​

చికెన్ ​కోసం వెళ్లిన యువకులకు, దుకాణదారుడికి మధ్య వాగ్వాదం తలెత్తింది. ఈ గొడవ పెరిగి రెండు వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో కొందరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గొడవను సద్దుమణిగించారు. ఈ ఘటన సోమవారం రాత్రి ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

stone pelting in aligarh
చికెన్​ కోసం వాగ్వాదం

By

Published : Jan 17, 2023, 10:18 AM IST

Updated : Jan 17, 2023, 11:46 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లో రెండు వర్గాల మధ్య భీకర రాళ్లదాడి జరిగింది. చికెన్​ కొనుగోలు విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ చెలరేగగా.. ఒకరిపై ఒకరు రాళ్లదాడి చేసుకున్నారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించారు.

అసలేం జరిగిందంటే..?
సోమవారం రాత్రి అలీగఢ్​లోని సరాయ్​ సుల్తానీలో ఉన్న ఓ మాంసం దుకాణానికి ఇద్దరు యువకులు చికెన్ కోసం వెళ్లారు. ఆ సమయంలో దుకాణదారుడికి, ఆ యువకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ గొడవ కాస్త పెద్దదిగా మారి.. పరస్పరం ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఆ తర్వాత ఈ గొవడ గురించి తెలిసిన ఇరు వర్గాలవారు అక్కడ చేరుకుని పెద్ద ఎత్తున రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా యంత్రాంగం.. భారీ సంఖ్యలో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. వెంటనే ఇరువర్గాలను శాంతింపజేసి.. గొడవ సద్దిమణిగేలా చూశారు. ఈ దాడిలో గాయపడిన నలుగురిని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ విక్రమ్ సింగ్ తెలిపారు. దీనిపై అధికారికంగా ఎటువంటి ఫిర్యాదు అందలేదని.. అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని డీఐజీ దీపక్​ కుమార్ వెల్లడించారు.

భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు

డబ్బుకోసం యువతి కిడ్నాప్​..
యూపీలోని మహారాజ్​గంజ్​​ జిల్లాలో ఓ 'లా' విద్యార్థిని కిడ్నాప్​​ స్థానికంగా కలకలం రేపింది. సోమవారం సాయంత్రం పరీక్ష రాసి బయటకు వచ్చిన ఆ యువతిని కొందరు మహిళలు రెండు కార్లలో వచ్చి బలవంతంగా ఎత్తుకెళ్లారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని.. సీసీటీవీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. సోమవారం రాత్రి సమయంలో నౌత్వానా ప్రాంతంలోని ఓ టోల్​గేట్​ వద్ద ఆమెను గుర్తించారు పోలీసులు. యువతి గతంలో ఓ ఎన్​జీఓ నిర్వహించేదని.. ఆ డబ్బులు కొసమే ఆమెను అపహరించినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Last Updated : Jan 17, 2023, 11:46 AM IST

ABOUT THE AUTHOR

...view details